త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌పై దాడి

Sukhbir Singh Badal | పంజాబ్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి, శిరోమణి అకాలీదళ్ (Shiromani Akali Dal) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ (Sukhbir Singh Badal)పై దాడి జ‌రిగింది. నాందేడ్ (Nanded)లోని మాతా సాహెబ్ కౌర్ ప్రాంతంలోని ఒక గురుద్వారా (Gurudwara) వ‌ద్ద గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ప‌దునైన ఆయుధంతో ఆయ‌న‌పై దాడి చేశాడు.

D

National | Published On Aug 13, 2026, 3.07 pm IST

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌పై దాడి
Advertisement

Sukhbir Singh Badal | త్రినేత్ర‌.న్యూస్ : పంజాబ్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి, శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ (Sukhbir Singh Badal)పై దాడి జ‌రిగింది. మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ (Nanded)లో ఓ గురుద్వారా వ‌ద్ద గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆయ‌న‌పై ప‌దునైన ఆయుధంతో అటాక్ చేశాడు. మాతా సాహెబ్ కౌర్ ప్రాంతంలోని ఒక గురుద్వారా వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ దాడిలో సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్‌ తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న కుడి చేతికి గాయం అయిన‌ట్లు స‌మాచారం. అప్ర‌మ‌మైన పోలీసులు వెంట‌నే ఆయ‌న్ని చికిత్స కోసం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. యశోసాయి ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేద‌ని వైద్యులు నిర్ధ‌రించారు. దాడిని అడ్డుకునే క్ర‌మంలో ఓ పోలీసు కూడా గాయ‌ప‌డిన‌ట్లుగా స‌మాచారం. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై నాందేడ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read..

వందేమాత‌రం పాడి వెళ్లిపోయారు.. ప్ర‌ధాని, అమిత్ షాపై మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం

12 బిల్లుల‌కు ఆమోదం.. ఒక్క దానిపైనే చ‌ర్చ‌

ఆ ఘ‌ట‌న చాలా అవ‌మానంగా అనిపించింది.. హ‌ల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖ‌ర్గే భావోద్వేగం

Advertisement
Advertisement