త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Mallu Ravi | వందేమాత‌రం పాడి వెళ్లిపోయారు.. ప్ర‌ధాని, అమిత్ షాపై మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం

MP Mallu Ravi | పార్ల‌మెంట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ తీరుపై కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (Congress MP Mallu Ravi) తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

D

National | Published On Aug 13, 2026, 2.49 pm IST

MP Mallu Ravi | వందేమాత‌రం పాడి వెళ్లిపోయారు.. ప్ర‌ధాని, అమిత్ షాపై మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం
Advertisement

MP Mallu Ravi | పార్ల‌మెంట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ తీరుపై కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (Congress MP Mallu Ravi) తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవ‌లం వాయిదా వేసేందుకు స‌భ‌కు వ‌స్తున్నార‌ని, ఇవాళ వందేమాత‌రం (Vande Mataram) పాడి వెళ్లిపోయార‌ని విమ‌ర్శించారు.

"ఈ సమావేశాల మొదటి రోజు ప్రధానమంత్రి, హోంమంత్రి వచ్చారు. వందేమాతరం పాడిన తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. మ‌ళ్లీ ఈ రోజు వారు సభకు వచ్చి వందేమాతరం పాడారు. ఆ త‌ర్వాత స‌భ‌ను వాయిదా వేయించి వెళ్లిపోయారు. గ‌త 18 రోజులుగా హోంమంత్రి స‌భ‌కు ఎందుకు రాలేదు..? అమిత్ షా వ‌చ్చి ప్ర‌క‌ట‌న చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఆ డిమాండ్‌ను వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇవాళ కూడా కేవలం సభను వాయిదా వేయడానికే ఆయ‌న‌ వ‌చ్చారు. స్పీకర్, ప్రధాని, హోంమంత్రి ముందే చర్చించుకుని సభను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యం అంటే..? ఎంపీలు భార‌త ప్ర‌జాస్వామ్యానికి సంర‌క్ష‌కులుగా ఉండాలి. కానీ ప్రస్తుత పాలకులు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువులను పూర్తిగా నాశనం చేస్తున్నారు" అని మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు.

Also Read..

12 బిల్లుల‌కు ఆమోదం.. ఒక్క దానిపైనే చ‌ర్చ‌

ఆ ఘ‌ట‌న చాలా అవ‌మానంగా అనిపించింది.. హ‌ల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖ‌ర్గే భావోద్వేగం

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చ‌రిత్ర‌లో తొలిసారి

Advertisement
Advertisement