త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala Special Trains | అయ్యప్ప భ‌క్తులకు గుడ్ న్యూస్.. హైద‌రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains | శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప భ‌క్తుల‌కు (Ayyappa Devotees) ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా 54 రైళ్ల‌ను (Sabarimala Special Trains) న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

G

Telangana | Published On Nov 13, 2026, 9.04 am IST

Sabarimala Special Trains | అయ్యప్ప భ‌క్తులకు గుడ్ న్యూస్.. హైద‌రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు
Advertisement

Sabarimala Special Trains | త్రినేత్ర న్యూస్‌: శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప భ‌క్తుల‌కు (Ayyappa Devotees) ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా 54 రైళ్ల‌ను (Sabarimala Special Trains) న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రైళ్లు న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి మాసాల్లో సేవ‌లు అందిస్తాయ‌ని తెలిపింది. హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లాంకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది. దీంతో తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్ర నుంచి శ‌బ‌రిమ‌ల వెళ్లే అయ్య‌ప్ప భ‌క్తుల సౌక‌ర్యార్థం ఆయా ప్రాంతాల మీదుగా ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఏ రైలు ఎప్పుడంటే..?

హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ (రైలు నం. 07193 / 07194): ఈ రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (శనివారాల్లో) రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 7.15 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో (సోమవారాల్లో) ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి, మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్ల‌గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం స్టాపుల్లో ఆగుతాయి.

చర్లపల్లి-కొల్లాం-చర్లపల్లి (రైలు నం.07180 / 07181): ఈ రైలు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (శుక్రవారాల్లో) రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ఆదివారాల్లో) ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి సోమవారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

చర్లపల్లి-కొల్లాం-చర్లపల్లి (రైలు నం.07195 / 07196): నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో (ఆదివారాల్లో) రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో (మంగళవారాల్లో) ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి బుధవారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

చర్లపల్లి-కొల్లాం-చర్లపల్లి (రైలు నం.07197 / 07198): ఈ రైలు డిసెంబర్ 2, 9, 16, 23 తేదీల్లో (బుధవారాల్లో) రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (శుక్రవారాల్లో) ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైళ్లు న‌ల్ల‌గొండ‌, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

చర్లపల్లి-కొల్లాం-చర్లపల్లి (రైలు నం. 07199 / 07200): కాజీపేట‌, విజ‌య‌వాడ మీదుగా వెళ్లే రైలు.. డిసెంబర్ 30, జ‌న‌వ‌రి 6, 13 తేదీల్లో రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో 2027 జనవరి 1, 8, 15 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైళ్లు భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం, కరునాగపల్లి, శాస్తాంకొట్ట స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

నాందేడ్-కొల్లాం-చర్లపల్లి (రైలు నం. 07189 / 07190): ఈ రైలు నవంబర్ 15న‌ (ఆదివారం) సాయంత్రం 5.15 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 7.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో నవంబర్ 17న‌ (మంగళవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి, బుధవారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైలు ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లి (07189 రైలుకు మాత్రమే), నల్ల‌గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం మీదుగా వెళ్తుంది.

Advertisement
Advertisement