Baby Sold | 48 గంటల్లోనే మూడింతలైన ధర.. నెల వయసున్న బాబును రూ.1.20 లక్షలకు కొని.. రూ.3.50 లక్షలకు అమ్మేశారు
Baby Sold | మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో (Sambhajinagar) విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక నెల వయసున్న పసికందును (Baby Sold) అమ్మిన తల్లింద్రడులు.. వచ్చిన ఆ డబ్బుతో బంగారు ఆభరణాలు, రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు (Smartphones) కొనుగోలు చేశారు.
Baby Sold | త్రినేత్ర న్యూస్: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో (Sambhajinagar) విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక నెల వయసున్న పసికందును (Baby Sold) అమ్మిన తల్లింద్రడులు.. వచ్చిన ఆ డబ్బుతో బంగారు ఆభరణాలు, రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు (Smartphones) కొనుగోలు చేశారు. అయితే ఆ చిన్నారి ధర 48 గంటల్లో మూడింతలు పెరగడం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించడం గమనార్హం.
శంభాజీనగర్ టూ హైదరాబాద్ వయా నాందేడ్
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాకు చెందిన వందన, యోగోశ్ కామ్రే దంపతులు తమ నెల రోజుల బాబును రూ.1.20 లక్షలకు సీమా రెష్వాల్ అనే మహిళకు విక్రయించారు. ఆమె పడేగావ్‌కు చెందిన సంగీత అవధ్ అనే మహిళలకు రూ.2.7 లక్షలకు ఆ పసికందును అమ్మేసింది. అనంతరం ఆ బాబును నాందేడ్‌కు (Nanded) తీసుకెళ్లిన సంగీత.. డాక్టర్‌గా చెప్పుకుంటున్న సురేశ్ గుంట్కా అనే వ్యక్తి రూ.3 లక్షల 50 వేలకు విక్రయించింది. అతడు హైదరాబాద్‌లో (Hyderabad) ఉంటున్న తన బంధువు ఉమ ఖట్కమ్‌కు అంతే మొత్తానికి అమ్మేశాడు. అలా మూడు చేతులు మారిన ఆ బాబు 48 గంటల వ్యవధిలోనే రూ.1.20 లక్షల నుంచి రూ.3.50 లక్షల ధర పలికాడు.

ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?
కాగా, పసికందు తల్లి వందన తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఈ నెల 20న శంభాజీనగర్‌లో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమెను ప్రశ్నిస్తున్న క్రమంలో శిశువు అమ్మకానికి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సెప్టెంబర్ 24న కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వందన నుంచి బాబును కొనుగోలు చేసిన సీమా రేష్వాల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆ పాప రాష్ట్రంతోపాటు మూడు చేతులు మారినట్లు తేలింది. దీంతో హైదరాబాద్ చేరుకున్న పోలీసులు.. ఉమ ఖట్కమ్ నుంచి ఆ చిన్నారిని స్వాధీనం చేసుకుని సురక్షితంగా మహారాష్ట్రకు తరలించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee) ఆదేశాల మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఈ కేసులో శిశువు కన్నతల్లితో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కాగా, పసికందును అమ్మడిన డబ్బుతో ఆ పాప తల్లిదండ్రులు రూ.62,000 విలువైన బంగారు ఆభరణాలు, రెండు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Private Travels Bus | ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన ప్రాణ నష్టం
సెప్టెంబర్ 30, 2026

She Teams | గణేశ్ ఉత్సవాల్లో రెచ్చిపోయిన పోకిరీలు.. 2,935 మంది అదుపులోకి తీసుకున్న షీటీమ్స్..
సెప్టెంబర్ 29, 2026

Ponguleti Srinivas Reddy | ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం
- ●Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్
- ●Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
- ●Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ●Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెరిగిన చమురు ధరలు..
- ●LPG Cylinder Rules | రేపటి నుంచి మారనున్న గ్యాస్ సిలిండర్ నిబంధనలు.. ఇకపై వారికి కమర్షియల్ ధరకే!

HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం

Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..

Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్



