త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nestle India | ప‌సిపిల్ల‌ల‌ పోష‌కాహార ఉత్ప‌త్తుల్లో నిబంధ‌నల‌ ఉల్లంఘ‌న‌.. నెస్లే ఇండియాపై FSSAI లీగ‌ల్ యాక్ష‌న్‌

Nestle India | నెస్లే ఇండియా (Nestle India) సంస్థపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) శుక్రవారం చట్టపరమైన చర్యల‌కు ఉప‌క్ర‌మించింది (Legal Action Against Nestle India).

D

National | Published On Sep 18, 2026, 1.47 pm IST

Nestle India | ప‌సిపిల్ల‌ల‌ పోష‌కాహార ఉత్ప‌త్తుల్లో నిబంధ‌నల‌ ఉల్లంఘ‌న‌.. నెస్లే ఇండియాపై FSSAI లీగ‌ల్ యాక్ష‌న్‌
Advertisement

Nestle India | ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) దిగ్గజం నెస్లే ఇండియా (Nestle India) సంస్థపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) శుక్రవారం చట్టపరమైన చర్యల‌కు ఉప‌క్ర‌మించింది (Legal Action Against Nestle India). ప‌సి పిల్ల‌ల‌కు (Baby Formula) చెందిన‌ పోషకాహార ఉత్పత్తులైన NAN Excella Pro Stage 1, Lactogen Pro 1 బేబీ ఫార్ములాల విక్ర‌యాల్లో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

NAN Excella Pro Stage 1 ఉత్పత్తికి సంబంధించి 5 హెచ్‌ఎంఓఎస్ (5 HMOs), సులభంగా జీర్ణమయ్యే వే ప్రోటీన్ అంశాలపై చేసిన ప్రచార ప్రకటనలపై నియంత్రణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా Lactogen Pro 1 విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో చేసిన కొన్ని ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని FSSAI గుర్తించింది. దీనిపై నెస్లే ఇండియా సంస్థ‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) వివరణ కోరింది.

మ‌రోవైపు ఈ సంస్థ త‌యారు చేసిన ఒక ఫాలో-అప్ ఫార్ములా నమూనాను ల్యాబ్ పరీక్షలకు పంపగా.. అందులో బయోటిన్ (Biotin) మోతాదు నిర్దేశిత ప్రమాణాల కంటే త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. దీంతో ఆ న‌మూనాల‌ను మ‌రోసారి ప‌రీక్ష‌ల నిమిత్తం రిఫ‌ర‌ల్ ల్యాబొరేట‌రీకి పంప‌గా.. అక్క‌డ కూడా 2020 ఆహార భద్రతా నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్దేశించిన బ‌యోటిన్ మోతాదు లేద‌ని, నిబంధ‌న‌లు విరుద్ధంగా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో నెస్లే ఇండియా (Nestle India) సంస్థపై FSSAI చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. మూడు వేర్వేరు కేసులు న‌మోదు చేసింది. FSSAI చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వార్తలు రావడంతో షేర్ మార్కెట్‌లో నెస్లే ఇండియా షేర్లు ఒక్క‌సారిగా పడిపోయాయి. శుక్ర‌వారం ట్రేడింగ్‌లో నెస్లే ఇండియా షేర్లు దాదాపు 2% నుంచి 3% మేర పతనమయ్యాయి.

కాగా, గ‌తంలోనూ నెస్లే ఇండియా ఉత్ప‌త్తుల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. భారత్‌ సహా కొన్ని పేద దేశాల్లో విక్రయిస్తున్న బేబీ ఫుడ్‌ ఉత్పత్తుల్లో అధిక చక్కెర వాడుతున్నట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మార్గదర్శకాల‌కు విరుద్ధంగా.. నెస్లే కంపెనీ చిన్నారుల‌కు పెట్టే సెరెలాక్‌లో స‌గ‌టున 3 గ్రాముల చక్కెర అద‌నంగా ఉన్న‌ట్లు స్విస్ ప‌రిశోధ‌నా సంస్థ పబ్లిక్ ఐ చేసిన పరిశోధనలో తేలింది. దీంతో అప్ప‌ట్లో నెస్లే ఉత్ప‌త్తుల‌ భద్రతపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి చిన్నారుల‌కు సంబంధించిన ఆహార ఉత్ప‌త్తుల్లో నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read..

పిడిగుద్దుల వ‌ర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్ర‌యాణికులు

మొద‌ట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు

చెన్నై క్వీన్ డ‌బుల్ ధ‌మాకా - సంక్రాంతి బ‌రిలో త్రిష రెండు సినిమాలు

Advertisement
Advertisement