త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | చెన్నై క్వీన్ డ‌బుల్ ధ‌మాకా – సంక్రాంతి బ‌రిలో త్రిష రెండు సినిమాలు

సంక్రాంతికి త్రిష హీరోయిన్‌గా న‌టించిన రెండు సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. చిరంజీవి విశ్వంభ‌ర‌తో పాటు త‌మిళ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్నాయి. పండుగ బ‌రిలో త‌న సినిమాతో త్రిష తానే పోటీప‌డ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Sep 18, 2026, 1.31 pm IST

Trisha | చెన్నై క్వీన్ డ‌బుల్ ధ‌మాకా – సంక్రాంతి బ‌రిలో త్రిష రెండు సినిమాలు
Advertisement

Trisha |  ఈ సంక్రాంతికి త్రిష బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సినిమాతో తానే పోటీప‌డ‌బోతుంది. చెన్నై క్వీన్ హీరోయిన్‌గా న‌టించిన రెండు సినిమాలు పండుగ బ‌రిలో నిల‌వ‌బోతున్నాయి. ఇందులో ఒక‌టి త‌మిళ సినిమా కాగా...మ‌రోటి తెలుగు మూవీ కావ‌డం గ‌మ‌నార్హం.

విశ్వంభ‌ర‌...

చిరంజీవి హీరోగా న‌టించిన విశ్వంభ‌ర వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి రెండేళ్లు దాటిపోయింది. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో వాయిదాప‌డుతూ వ‌స్తోంది. ఇటీవ‌లే నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు మొత్తం పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ఓటీటీ డీల్‌...

ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది. భారీ ధ‌ర‌కు అమెజాన్ ప్రైమ్ విశ్వంభ‌ర‌ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. ఓటీటీ సంస్థ‌తో కుదిరిన ఒప్పందం కార‌ణంగా సంక్రాంతికి విశ్వంభ‌ర‌ను థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్నారు మేక‌ర్స్‌. మైథ‌లాజిక‌ల్ సోషియా ఫాంట‌సీ క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో త్రిష‌, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దాదాపు ఇర‌వై ఏళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరంజీవి, త్రిష కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాకు వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో స్టాలిన్ మూవీ రూపొందింది. విశ్వంభ‌ర సినిమాను యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

త్రిష హీరోయిన్‌గా ఇటీవ‌లే ఓ త‌మిళ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ లండ‌న్‌లో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజాకృష్ణ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పండుగ‌ను టార్గెట్‌గా పెట్టుకొని మేక‌ర్స్ షూటింగ్‌ను పూర్తిచేసే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. రాధికా శ‌ర‌త్‌కుమార్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

విజ‌య్‌తో రిలేష‌న్‌...

ఇటీవ‌లే క‌రుప్పు మూవీతో పెద్ద హిట్టును అందుకుంది త్రిష‌. సూర్య హీరోగా న‌టించిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. కాగా సినిమాల‌తో కంటే త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో రిలేష‌న్‌తోనే గ‌త కొద్ది రోజులుగా ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది త్రిష‌. ఇటీవ‌లే లండ‌న్‌లో జ‌రిగిన అజిత్ రేసింగ్ పోటీల‌కు త్రిష‌తో క‌లిసి విజ‌య్ అటెండ్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

 

Advertisement
Advertisement