Bisleri | మినరల్ వాటర్‌లో ఉండే బ్రోమేట్ ఆరోగ్యానికి ఎలా హానికరం..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Bisleri | ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరి నీటి నమూనా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పరీక్షల్లో విఫలమైంది. బ్రోమేట్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్ఎస్) అనే రెండు రసాయనాలు గుర్తించడంతో ఆ నమూనాను సురక్షితం కాదని ప్రకటించారు. అయితే బిస్లెరి మాత్రం తమ నీరు సురక్షితమేనని వెల్లడించింది.
Bisleri | ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరి నీటి నమూనా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పరీక్షల్లో విఫలమైంది. బ్రోమేట్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్ఎస్) అనే రెండు రసాయనాలు గుర్తించడంతో ఆ నమూనాను సురక్షితం కాదని ప్రకటించారు. అయితే బిస్లెరి మాత్రం తమ నీరు సురక్షితమేనని వెల్లడించింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ పరీక్షల్లో ఎదురుదెబ్బ..
దేశంలో ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన బిస్లెరికి ఎఫ్ఎస్ఎస్ఏఐ పరీక్షల్లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన గోవా ప్లాంట్ నుంచి 2025 సెప్టెంబర్ 30న సేకరించిన నీటి నమూనాలో నిబంధనలకు మించి బ్రోమేట్ ఉన్నట్లు తొలి పరీక్షలో వెల్లడైంది. లీటరు నీటిలో బ్రోమేట్ పరిమితి 10 మైక్రోగ్రాములు కాగా, పరీక్షలో 12 మైక్రోగ్రాములు నమోదయ్యాయి. అనంతరం రిఫరల్ ల్యాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో బ్రోమేట్ పరిమితుల్లోనే ఉన్నట్లు తేలినప్పటికీ, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్ఎస్) గుర్తించడంతో ఆ నమూనాను సురక్షితం కాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద బిస్లెరి ఇంటర్నేషనల్పై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది. అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆమోదం పొందిన స్వతంత్ర ప్రయోగశాల పరీక్షల్లో బ్రోమేట్ పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని, ఇప్పటివరకు తమకు అధికారిక నోటీసు అందలేదని, ఈ నమూనా సుమారు 14 నెలల క్రితం సేకరించిందని బిస్లెరి తెలిపింది.
బ్రోమేట్, పీఏహెచ్ఎస్ ఎంత ప్రమాదకరం?
నీటిని శుద్ధి చేసే సమయంలో సూక్ష్మజీవులను నాశనం చేసేందుకు ఓజోన్ను ఉపయోగించినప్పుడు బ్రోమేట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) దీనిని గ్రూప్-2బీ కింద వర్గీకరించింది. అంటే ఇది మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని, అయితే దీనిపై మానవులలో లభించిన ఆధారాలు సరిపోవడం లేదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లీటరు నీటిలో బ్రోమేట్ పరిమితిని 10 మైక్రోగ్రాములుగా సూచించింది. బిస్లెరి నమూనాలో నమోదైన 12 మైక్రోగ్రాములు ఈ పరిమితి కంటే స్వల్పంగా ఎక్కువ. ఇక పీఏహెచ్ఎస్ అనేవి కాలుష్య కారకాల సమూహం. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని కాల్చినప్పుడు లేదా గ్రిల్ చేసినప్పుడు కూడా ఇవి ఏర్పడతాయి. వీటిలో కొన్ని క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఉదాహరణకు బెంజో(ఎ) పైరీన్ను ఐఏఆర్సీ మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థంగా వర్గీకరించింది. అయితే బిస్లెరి నమూనాలో ఏ రకమైన పీఏహెచ్ఎస్ గుర్తించారో, వాటి పరిమాణం ఎంత ఉందో ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ వివరాలు లేకుండా ఆరోగ్యపరమైన ముప్పును అంచనా వేయడం సాధ్యం కాదు.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
బిస్లెరి సంస్థకు దేశవ్యాప్తంగా 143 ప్లాంట్లు ఉండగా, వాటిలో ఒక ప్లాంట్ నుంచి సేకరించిన ఒక్క నమూనా పరీక్షలో విఫలమైనంత మాత్రాన కంపెనీకి చెందిన మొత్తం నీరు సురక్షితం కాదని నిర్ధారించలేమని నివేదిక పేర్కొంది. మరోవైపు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు సంబంధించి 2024 అక్టోబర్‌లో ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరణను తప్పనిసరి చేసే నిబంధనను తొలగించింది. అన్ని ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత వార్తలు

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
నవంబర్ 23, 2026

Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ
నవంబర్ 23, 2026

Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!
- ●Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!
- ●Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..
- ●BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ
- ●Sadhguru On Dead Person Clothes | చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?
- ●Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ

Rashmika Mandanna | బయోపిక్ కోసం సంగీత పాఠాలు - నేషనల్ క్రష్ డెడికేషన్ అట్లుంటది మరి!

Septic Tank deaths | హైదరాబాద్‌లో ఘోరం.. సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ఎంతమంది యువకులు చనిపోయారంటే!

Edits App | ఎడిట్స్ ఐప్యాడ్ యాప్‌లో కొత్త ఫీచర్లు.. ఇక ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ మరింత సులభం..

BJP-SAD alliance | మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ



