Supreme Court | ఫుడ్ ప్యాకెట్లపై “రెడ్” వార్నింగ్ ఉండాల్సిందే.. FSSAIకి సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court | ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థకు (FSSAI) సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల్లో ఫ్యాట్, షుగర్, సాల్ట్ మోతాదుకు మించి ఉంటే వాటిని తెలియజేస్తూ విడివిడిగా ఎరుపు గుర్తు హెచ్చరిక లేబుళ్లను ముద్రించాలని స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై ముందు భాగంలో పోషక విలువల లేబులింగ్ (ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ న్యూట్రిషన్ లేబులింగ్-FoPNL) నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను (FSSAI) సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఆహార ఉత్పత్తుల్లో ఫ్యాట్, షుగర్, సాల్ట్ మోతాదుకు మించి ఉంటే వాటిని తెలియజేస్తూ విడివిడిగా హెచ్చరిక లేబుళ్లను ముద్రించాలని స్పష్టం చేసింది.
లేబులింగ్ విధానంలో ఉప్పుతో పాటు 'అదనపు చక్కెర' (Added Sugar), 'అదనపు కొవ్వు' (Added Fat) అనే పదాలకు బదులుగా 'మొత్తం చక్కెర' (Total Sugars), 'సంతృప్త కొవ్వు' (Saturated Fat) లను ఆందోళనకర పోషకాలుగా గుర్తించాలని తేల్చి చెప్పింది. అన్నింటినీ కలిపి ఒకే గుర్తులో కాకుండా 'హై ఫ్యాట్' (High Fat), 'హై షుగర్' (High Sugar), 'హై సాల్ట్' (High Salt) అని ప్రతి పోషకానికి వేర్వేరుగా రెడ్ హెక్సాగన్ గుర్తును ముద్రించాలని ఆదేశించింది. అది కూడా వినియోగదారులకు కనిపించేలా ముందు భాగంలోనే రెడ్ గుర్తులు ఉండాలని జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
చిన్నారుల్లో పెరుగుతున్న స్థూలకాయానికి (Childhood Obesity) అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలే కారణమని పేర్కొంటూ ఓ ఎన్జీవో సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింన విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాల మాదిరిగానే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఇటీవలే విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం FSSAI, ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్ల ముద్రణ నిబంధనలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ చేసింది.
Also Read..
మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
రన్‌వేపై నాలుగు విమానాలు ల్యాండింగ్.. భారత సైన్యం అసాధారణ ఫీట్..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sukesh Chandrashekhar | సుఖేష్ చంద్రశేఖర్ జీవితంపై వెబ్‌సిరీస్ - బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలపై సంచలన నిజాలతో
- ●Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
- ●Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి
- ●Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి
- ●Web Series | పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయొద్దు.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
- ●FII Buying | నవంబర్‌లో ఎఫ్ఐఐల రికార్డు కొనుగోళ్లు.. రూ.1.22 లక్షల కోట్ల పెట్టుబడులు..

Sukesh Chandrashekhar | సుఖేష్ చంద్రశేఖర్ జీవితంపై వెబ్‌సిరీస్ - బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలపై సంచలన నిజాలతో

Sharad Pawar | మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Dasoju Sravan | భవిష్యత్ తరాలకు మంచి దేశాన్నివ్వాలి.. అందుకు రాజ్యాంగం చదవాలి

Sai Pallavi | రామాయణకు అమిత్‌షా అభినందనలు - కేంద్రమంత్రిని కలిసిన రణబీర్, సాయిపల్లవి






