త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Passengers | పిడిగుద్దుల వ‌ర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్ర‌యాణికులు

Air Passengers | ఓ విమానంలో (flight) ప్ర‌యాణికులు (Passengers) దారుణంగా కొట్టుకున్నారు. పిడిగుద్దుల వ‌ర్షం కురిపించుకున్నారు. గొడ‌వ తీవ్రం కావ‌డంతో ఓ ప్ర‌యాణికుడి టీషర్ట్ కూడా చిరిగిపోయింది.

D

International | Published On Sep 18, 2026, 1.17 pm IST

Air Passengers | పిడిగుద్దుల వ‌ర్షం.. విమానంలో దారుణంగా కొట్టుకున్న ప్ర‌యాణికులు
Advertisement

Air Passengers | విమాన ప్రయాణంలో (flight) చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల (Air Passengers) ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు తప్పతాగి వికృతచేష్టలకు పాల్పడుతుంటారు. మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారితో గొడ‌వ‌కు దిగుతుంటారు. తాజాగా ఓ విమానంలో ప్ర‌యాణికులు దారుణంగా కొట్టుకున్నారు.

బిమాన్ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్ విమానం (Biman Bangladesh Airlines flight) లండ‌న్‌ నుంచి ఢాకా బ‌య‌ల్దేరింది. విమానం దాదాపు వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణిస్తోంది. ప్ర‌యాణికులంతా ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంత‌లో ఊహించిన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు ప్ర‌యాణికుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి భౌతిక దాడికి దారితీసింది. ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు దారుణంగా కొట్టుకున్నారు. పిడిగుద్దుల వ‌ర్షం కురిపించుకున్నారు. గొడ‌వ తీవ్రం కావ‌డంతో ఓ ప్ర‌యాణికుడి టీషర్ట్ కూడా చిరిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో విమానంలోని తోటి ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప‌రిస్థితి తీవ్రంగా మార‌డంతో సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read..

బ్రీత్‌టెస్ట్‌కు హాజ‌రుకాని ఎయిర్ ఇండియా సిబ్బంది.. 8 మందిపై వేటు

మొద‌ట ఓటు చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ.. ఈసీపై రాహుల్ గాంధీ విమర్శలు

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు.. హైద‌రాబాద్ ఎన్ఐఏ కోర్టు సంచ‌ల‌న తీర్పు

Advertisement
Advertisement