DMK | ముందు మద్దతు కూడగట్టుకోండి.. ఆ తర్వాత గవర్నర్‌ను కలవొచ్చు.. విజయ్‌పై డీఎంకే విమర్శలు
DMK | విజయ్‌పై డీఎంకే (DMK) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. విజయ్ ముందుగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని.. ఆ తర్వాతే గవర్నర్‌ను సంప్రదించాలని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ (TKS Elangovan) సూచించారు.
DMK | టీవీకే చీఫ్ విజయ్ (TVK Vijay)కి సీఎం పీఠం అందని ద్రాక్షలా మారింది. మెజారిటీ నిరూపించుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఇప్పటికే తాము మద్దతునిస్తున్నట్లు లేఖలు సమర్పించగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), విడుదలై చిరుతైగళ్ కట్చి (VCK) ఇంకా లేఖలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్‌పై డీఎంకే (DMK) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
విజయ్ ముందుగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని.. ఆ తర్వాతే గవర్నర్‌ను సంప్రదించాలని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ (TKS Elangovan) సూచించారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు గానూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. తాజాగా సీపీఎం (2), సీపీఐ (2) కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. అయినా మెజారిటీ లేదు.
ఈ నేపథ్యంలో ఇలంగోవన్ మాట్లాడుతూ.. "విజయ్ ఒంటరిగా అతిపెద్ద పార్టీ హోదాలో గవర్నర్‌ను కలిసి ఉంటే బహుశా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు అవకాశం దక్కేది. ఆ తర్వాత సభలో బలాన్ని నిరూపించుకోమని చెప్పేవారు. కానీ ఇతర పార్టీలను కలుపుకుని 112 మంది మద్దతు ఉందని చెప్పడం వల్ల మెజారిటీ లేదన్న విషయం స్పష్టమైంది. అందుకే గవర్నర్ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
Also Read..
తమిళ రాజకీయాల ఎఫెక్ట్ - త్రిష కొత్త సినిమా పోస్ట్‌పోన్?
వేదికపై వృద్ధుడి కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?
ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ.. ఎక్స్ బయో ఛేంజ్
సంబంధిత వార్తలు

CM Vijay vs MK Stalin | పరిపాలన చేతగాని డమ్మీ ముఖ్యమంత్రివి నువ్వు : ఉదయనిధి అరెస్ట్‌పై ఎంకే స్టాలిన్ ఫైర్
ఆగస్టు 4, 2026

Udhayanidhi Stalin | త్రిషపై అసభ్యకర కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
ఆగస్టు 4, 2026

Trisha | రాజకీయాల్లోకి త్రిష? – తమిళనాడులో వెలిసిన బ్యానర్లు – డీఎంకే సభలో చెన్నై క్వీన్ హవా
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్
- ●US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!
- ●Black Magic | హరీశ్‌రావుపై క్షుద్ర పూజల ఆరోపణలు.. ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన రేవంత్
- ●Telangana Irrigation | కిం కర్తవ్యం? సాగునీటికి కటకటేనా..!

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!



