Trisha | తమిళ రాజకీయాల ఎఫెక్ట్ – త్రిష కొత్త సినిమా పోస్ట్‌పోన్?
తమిళ రాజకీయాలు సినిమాకు మించిన ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే 108 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించిన ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోతుంది. కాగా తమిళ రాజకీయాల ప్రభావం త్రిష కొత్త సినిమా కరుప్పుపై పడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కానుందని అంటున్నారు.
Entertainment | Published On May 9, 2026, 3.02 pm IST
Trisha | తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గవర్నర్ నుంచి మాత్రం అతడికి ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.
త్రిష మూవీ పోస్ట్‌పోన్...
దళపతి విజయ్ రాజకీయాల ప్రభావం త్రిష కొత్త సినిమాపై పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ వీక్‌లో రిలీజ్ కానున్న త్రిష మూవీ వాయిదాపడనుందని అంటున్నారు. సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల పలుమార్లు రిలీజ్ డేట్ మారుతూ వస్తోంది. మే 14న కరుప్పును థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఫిక్సయ్యారు. ఇటీవలే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఆడియో లాంఛ్ ఈవెంట్‌తో పాటు ప్రమోషన్స్ చేస్తున్నారు.
రిస్క్ చేసినట్లే...
గత నాలుగైదు రోజులుగా తమిళ రాజకీయాల్లో కొనసాగుతోన్నఅనిశ్చితి కారణంగా కరుప్పు మూవీని వాయిదా పడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ పొలిటికల్ టెన్షన్‌లో రిలీజ్ చేసి రిస్క్ తీసుకోవడం కంటే సినిమాను పోస్ట్‌పోన్ చేయడమే మంచిదనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.
ప్రస్తుతం తమిళ ప్రజల దృష్టి మొత్తం పాలిటిక్స్ పైనే ఉంది. విజయ్ సీఎం అవుతాడా? టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఒకవేళ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అన్నది తమిళనాట సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ టైమ్‌లో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఒకవేళ రిలీజ్ చేసినా కూడా ఓపెనింగ్స్‌పై గట్టిగానే ఎఫెక్ట్ పడొచ్చని అంటున్నారు. ఈ రాజకీయ అనిశ్చితి పూర్తిగా తొలగిపోయిన తర్వాతే కరుప్పును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.
కరుప్పు రిలీజ్ పోస్ట్‌పోన్‌కు సంబంధించిన ప్రకటన మరో ఒకటి రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం. దాదాపు ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత సూర్య, త్రిష కలిసి నటించిన సినిమా ఇది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chinmayi | జయలలితనూ అవమానించారు – త్రిషకు క్షమాపణ చెప్పాల్సిందే- చిన్మయి, ఖుష్బూ డిమాండ్
ఆగస్టు 4, 2026

Tamil OTT | ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ – ప్రీతి ముకుందన్, కయదు లోహర్ హీరోయిన్లు – తెలుగులో స్ట్రీమింగ్
ఆగస్టు 3, 2026

Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ – పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!



