Mamata Banerjee | ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ.. ఎక్స్ బయో ఛేంజ్
Mamata Banerjee | "మేం ఓడిపోలేదు.. బీజేపీ ప్రజాతీర్పును దొంగిలించింది. నేను రాజ్‌భవన్‌కు వెళ్లను. రాజీనామా చేయను" అంటూ ప్రగల్భాలు పలికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు.
Mamata Banerjee | "మేం ఓడిపోలేదు.. బీజేపీ ప్రజాతీర్పును దొంగిలించింది. నేను రాజ్‌భవన్‌కు వెళ్లను. రాజీనామా చేయను" అంటూ ప్రగల్భాలు పలికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఈ మేరకు తన ఎక్స్ బయో (X Bio)ను మార్చి ఓటమిని అంగీకరిస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు.
తాను గత మూడు పర్యాయాలు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశానని పేర్కొంటూ.. దీదీ తన అధికారిక ఎక్స్ బయోను అప్‌డేట్ చేశారు. "ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్‌పర్సన్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ విధానసభ)" అని అందులో పేర్కొన్నారు. నిన్నటి దాకా ఆ స్థానంలో "ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్‌పర్సన్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి" అని ఉండేది. రాష్ట్రంలో నేడు సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడంతో ఆమె తన బయోను అప్‌డేట్ చేశారు. ఈ పరిణామంతో దీదీ తన ఓటమిని అంగీకరించినట్లుగా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
కాగా, 293 అసెంబ్లీ స్థానాలకు గానూ దీదీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ 80 స్థానాల్లో మాత్రమే గెలిచింది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దీదీ.. అక్కడ బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాల్లో జయభేరి మోగించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నేడు రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర తొమ్మిదో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఈ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా సువేందు రికార్డు సృష్టించారు.
Also Read..
వేదికపై వృద్ధుడి కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?
బెంగాల్‌లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం.. తొలి సీఎంగా సువేందు రికార్డు
తమిళనాట రాజకీయ గందరగోళం.. వెలుగులోకి ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్.. అందులో ఏముందంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mamata Banerjee | ఆ ద్రోహులకు పార్టీలోకి నో ఎంట్రీ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకంకావాలి : మమతా బెనర్జీ
జులై 21, 2026

Koel Mallick | దీదీకి షాక్.. రాజీనామా చేసిన మరో ఎంపీ
జులై 16, 2026

ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్‌కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
జులై 8, 2026
తాజావార్తలు
- ●Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు
- ●Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
- ●Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
- ●HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
- ●Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!
- ●Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా

Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు

Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?

Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్



