Fire breaks | కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Fire breaks | ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం (Fire breaks) సంభవించింది. వికాస్ మార్గ్‌లోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో (Ministry of Education office) మంటలు చెలరేగాయి.
Fire breaks | ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం (Fire breaks) సంభవించింది. వికాస్ మార్గ్‌లోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో (Ministry of Education office) మంటలు చెలరేగాయి. 'స్కూల్ ఆఫ్ ప్లానింగ్' భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
సోమవారం ఉదయం 9:37 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కార్యాలయాలు ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Delhi | Efforts underway to douse the fire on the second floor of the Ministry of Education office, Vikas Marg. Further details awaited. https://t.co/G2ndIHTKFk pic.twitter.com/EUC5RUk3bi
— ANI (@ANI) June 1, 2026
Also Read..
మే నెలలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
ఐఆర్‌జీసీ తీరుపై తీవ్ర అసంతృప్తి.. ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా..?
ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్.. యువకుడు మృతి
సంబంధిత వార్తలు

e-rickshaw battery blast | ఈ రిక్షా బ్యాటరీ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
ఆగస్టు 17, 2026

Bomb Threats | స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు.. లిస్ట్‌లో రెడ్ ఫోర్ట్, హైకోర్టు, రైళ్లు
ఆగస్టు 14, 2026

Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి



