Masoud Pezeshkian | ఐఆర్‌జీసీ తీరుపై తీవ్ర అసంతృప్తి.. ఇరాన్ అధ్యక్షుడు రాజీనామా..?
Masoud Pezeshkian | ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను ఇప్పటికే సుప్రీం లీడర్‌కు పంపినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
International | Published On Jun 1, 2026, 11.38 am IST
Masoud Pezeshkian | ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తీరుపై ఆ దేశ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిర్ణయాధికారాల్లో, ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఐఆర్‌జీసీ (IRGC) పెత్తనాన్ని నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మసౌద్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
రాజీనామా లేఖను ఇప్పటికే సుప్రీం లీడర్‌కు పంపినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వానికి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని అందులో ఆయన పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఐఆర్‌జీసీలోని తీవ్రవాద శక్తులు ఇరాన్ పాలన మొత్తం తమ చేతుల్లోకి తీసుకున్నాయని మసౌద్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. అధ్యక్షుడి రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బ్రిటన్‌కు చెందిన 'ఇరాన్ ఇంటర్నేషనల్' వార్తా సంస్థ నివేదించింది. ఇక ఈ నివేదికలపై ఇరాన్ అధికారులు స్పందించారు. రాజీనామా వార్తలను కొట్టిపారేశారు. అధ్యక్షుడు రాజీనామా చేయలేదని.. ఆయన తన విధులను యథావిధిగా నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు.
Also Read..
మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ స్థావరాలపై అమెరికా ఆత్మరక్షణ దాడులు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్
ఆగస్టు 9, 2026

Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
జులై 14, 2026

Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
జులై 13, 2026
తాజావార్తలు
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్



