UPI transactions | మే నెలలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
UPI transactions | దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (digital payment transactions) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
UPI transactions | దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (digital payment transactions) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మే నెలలో యూపీఐ లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. మేలో యూపీఐ లావాదేవీల పరిణామం ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరిగి 23.20 బిలియన్లకు చేరుకుంది. ఆ లావాదేవీల మొత్తం విలువ దాదాపు రూ. 30 లక్షల కోట్ల మార్కును తాకింది.
ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సోమవారం వెల్లడించింది. మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 29.90 లక్షల కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే (year-on-year) లావాదేవీల విలువ 19 శాతం పెరిగినట్లు చెప్పింది. మే నెలలో సగటున రోజుకు సుమారు 748 మిలియన్ల లావాదేవీలు జరిగాయని, వాటి సగటు విలువ రోజుకు సుమారు రూ.96,465 కోట్లుగా ఉందని ఎన్‌పీసీఐ వివరించింది.
గత నెలలో (ఏప్రిల్) కూడా డిజిటల్ చెల్లింపులు ఏడాది ప్రాతిపదికన (year-on-year) 25 శాతం వృద్ధితో 22.35 బిలియన్ల లావాదేవీలను నమోదు చేశాయి. వాటి విలువ రూ.29.03 లక్షల కోట్లుగా ఉంది. రోజువారీ ప్రాతిపదికన, సగటు లావాదేవీల సంఖ్య ఏప్రిల్ నెలలో గణనీయంగా పెరిగి 745 మిలియన్లకు చేరింది. అంతకు ముందు నెల అంటే మార్చిలో లావాదేవీల సంఖ్య 730 మిలియన్లుగా ఉంది. ఇక మే నెలలో యూపీఐతో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులైన ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీలు 358 మిలియన్లుగా, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా 88 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదికిపైగా దేశాల్లో..
భారత్ వెలుపలా యూపీఐ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం ఎనిమిదికిపైగా దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. యూపీఐని అంతర్జాతీయంగా విస్తరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత దశాబ్ద కాలంలో యూపీఐ లావాదేవీల సంఖ్యలో ఏకంగా 12,000 రెట్ల అసాధారణ వృద్ధి నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్లుగా ఉన్న లావాదేవీలు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి 24,162 కోట్లకు పైగా పెరగడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
Also Read..
ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక.. కాళేశ్వరం: మంత్రి వివేక్
అట్టుడుకుతున్న తెలంగాణ.. మరో వారం రోజులు మండుటెండలే..!
తెలంగాణలో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు: రాంచందర్ రావు
సంబంధిత వార్తలు

Arrest | బెంగళూరుకి పిలిచి కల్పిత విజయగాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని కటకటాలపాలయ్యారు
జులై 23, 2026

UPI | ఇక యూపీఐలో ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు.. త్వరలో కొత్త ట్యాప్ అండ్ పే ఫీచర్..
జులై 21, 2026

AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
- ●Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్
- ●CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

Raashii Khanna | బోల్డ్ ఫొటోలతో రాశీఖన్నా రచ్చ - ఈ యాంగిల్ ఊహించలేదంటూ ఫ్యాన్స్ రియాక్షన్

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్



