త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌.. రాహుల్‌, ప్రియాంక‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్య‌తిరేకంగా నిన్న ఢిల్లీలో ఇండీ కూట‌మి నిర‌స‌న‌ల సంద‌ర్భంగా ఎలాంటి అనుమ‌తి లేకుండా ఆకాశ‌వాణి కార్యాల‌యంలోకి (Akashvani Bhawan) బ‌ల‌వంతంగా ప్ర‌వేశించార‌న్న ఆరోప‌ణ‌లపై అందిన ఫిర్యాదు మేర‌కు కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

D

National | Published On Oct 7, 2026, 11.33 am IST

FIR Against Rahul Gandhi | సీఈసీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌.. రాహుల్‌, ప్రియాంక‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు
Advertisement

FIR Against Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. సీఈసీకి వ్య‌తిరేకంగా నిన్న ఢిల్లీలో ఇండీ కూట‌మి నిర‌స‌న‌ల సంద‌ర్భంగా ఎలాంటి అనుమ‌తి లేకుండా ఆకాశ‌వాణి కార్యాల‌యంలోకి (Akashvani Bhawan) బ‌ల‌వంతంగా ప్ర‌వేశించార‌న్న ఆరోప‌ణ‌లపై అందిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు. రాహుల్‌, ప్రియాంక‌తోపాటూ ప‌లువురు ఎంపీల‌పై కూడా కేసులు బుక్ చేశారు.

ఓట్ల దొంగతనం, ఓటర్ల జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో అక్రమాలు జ‌రుగుతున్నాయంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ మంగ‌ళ‌వారం ఉద‌యం ఇండీ కూట‌మి ప‌క్షాలు ఢిల్లీలో సేవ్ డెమొక్ర‌సీ పేరుతో భారీ మార్చ్ నిర్వ‌హించాయి. పార్ల‌మెంట్ వీధిని ఎంపీలు, నిర‌స‌న‌కారులు బ్లాక్ చేసి పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం నుంచి కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ర‌కూ ర్యాలీగా బ‌య‌ల్దేరారు. అయితే, ఆకాశ‌వాణి కార్యాల‌యం వ‌ద్ద ప్ర‌తిప‌క్ష ఎంపీల‌ను పోలీసులు నిల‌వ‌రించారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ అక్క‌డ పోలీసు బారికేడ్లు ఎక్కి జాతీయ జెండాను ఊపుతూ నిర‌స‌న‌ను కొన‌సాగించారు. ఆ స‌మ‌యంలో ఆకాశ‌వాణి కార్యాల‌యంలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు.

Also Read..

25 ఏళ్ల ప్ర‌జాప్ర‌స్థానం.. వినాయ‌కుడికి ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు

ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..

న‌ల్ల‌స‌ముద్రంలో ఆయిల్ ట్యాంక‌ర్‌పై ఉక్రెయిన్ డ్రోన్‌ దాడి.. సిబ్బంది అంతా భార‌తీయులే

Advertisement
Advertisement