త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhya Pradesh | Massive Fire | మూడంత‌స్తుల భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు స‌జీవ ద‌హ‌నం

Massive Fire | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లోని Seoni జిల్లా ఛ‌పారా ప‌ట్ట‌ణంలో భారీ అగ్నిప్ర‌మాదం (Massive Fire ) జ‌రిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.

G

National | Published On Nov 9, 2026, 10.05 am IST

Madhya Pradesh | Massive Fire | మూడంత‌స్తుల భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు స‌జీవ ద‌హ‌నం
Advertisement

Massive Fire | త్రినేత్ర న్యూస్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లోని Seoni జిల్లా ఛ‌పారా ప‌ట్ట‌ణంలో భారీ అగ్నిప్ర‌మాదం (Massive Fire ) జ‌రిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ 4 గంట‌ల స‌మ‌యంలో కుంద‌న్ లాల్ సోని (Kundan Lal Soni) అనే స్వ‌ర్ణ‌కారుడికి (Goldsmith) చెందిన మూడంత‌స్తుల భ‌వ‌నంలో ఒక్క‌సారిగా మంటలు చెల‌రేగాయి. మంట‌లు వేగంగా భ‌వ‌న‌మంతా వ్యాపించ‌డంతో ఆరుగురు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు, రెండు నెల‌ల ప‌సికందు కూడా ఉన్నారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లు ఆర్పి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. భవనం చుట్టూ మంటలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలగగా, జేసీబీ సాయంతో గోడలను కూల్చి మృతదేహాలను వెలికితీశారు. గాయ‌ప‌డిన వారిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఇంట్లో ప‌ది మంది ఉన్నార‌ని అధికారులు చెప్పారు. కాగా, ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు ఇంక తెలియ‌రాలేదు. సోమ‌వారం తెల్ల‌వారుజామున 4 నుంచి 4.30 గంట‌ల మధ్య ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement