Cauvery water | కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Cauvery water | కావేరీ జలాల (Cauvery water) విషయంలో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. కావేరీ నదీ జలాల విడుదలపై కర్ణాటకను ఆదేశించాలన్న తమిళనాడు అభ్యర్థనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Cauvery water | త్రినేత్ర న్యూస్ : కావేరీ జలాల (Cauvery water) విషయంలో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. కావేరీ నది నుంచి అదనంగా 11 టీఎంసీల నీరు విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
నీటి కొరత కారణంగా తమ రాష్ట్రంలోని రైతులపై తీవ్ర ప్రభావం పడుతోందని, పంటలు దెబ్బతింటున్నాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. బిలిగుండ్లు వద్ద తమకు రావాల్సిన నీటి వాటాలో 11.719 టీఎంసీల లోటు ఉందని తెలిపింది. కర్ణాటక జలాశయాల్లో తగినంత నిల్వలు ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. పంటలను కాపాడేందుకు రోజుకు 1.3 టీఎంసీల చొప్పున 10 రోజుల పాటు నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
అయితే, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తీవ్ర కరవు నెలకొన్నాయని కర్ణాటక ప్రభుత్వం వాదించింది. కావేరీ జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాల మేరకే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కావేరి జలాల నుంచి 11 టీఎంసీల లోటును భర్తీ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ విక్రమ్ నాథ్ (Justice Vikram Nath), జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Justice Aparesh Kumar Singh)లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు అభ్యర్థతనను తిరస్కరించింది.
ఈ మేరకు అదనపు నీటి విడుదల కోసం తమిళనాడు దాఖలు చేసిన రెండు ప్రధాన పిటిషన్లతో పాటు, అదనపు పత్రాలను సమర్పించేందుకు వేసిన మూడో పిటిషన్‌ను కూడా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం వరుసగా పిటిషన్లు దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. "న్యాయవాదులపై ఖర్చు చేయడానికి తమిళనాడు వద్ద చాలా అదనపు నిధులు ఉన్నట్లున్నాయి" అంటూ వ్యాఖ్యానించింది.
Also Read..
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు.. సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
నవంబర్ 20, 2026

Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
నవంబర్ 20, 2026

Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య
- ●ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!

AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య

ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!

Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..



