Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాలోని షెన్‌జెన్ (Shenzhen) వేదికగా ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్ (Xi Jinping) మధ్య అత్యంత కీలకమైన త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. రాజీపడిన ప్రధాని (PM Modi) ఎప్పటికీ ఆ టేబుల్ వద్ద కూర్చోలేరంటూ మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : అమెరికా, చైనా, రష్యా అగ్రనేతల సమావేశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన సోషల్ మీడియా పోస్ట్ దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చైనాలోని షెన్‌జెన్ (Shenzhen) వేదికగా ట్రంప్ (Donald Trump), పుతిన్ (Vladimir Putin), షీ జిన్‌పింగ్ (Xi Jinping) మధ్య అత్యంత కీలకమైన త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్ తన ఎక్స్‌లో షేర్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే.. ఈ టేబుల్ వద్ద భారత ప్రధాన మంత్రి కూర్చొని ఉండేవారని పేర్కొన్నారు. రాజీపడిన ప్రధాని ఎప్పటికీ ఆ టేబుల్ వద్ద కూర్చోలేరంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
If Congress were in power, India's Prime Minister would be sitting at this table.
A compromised PM can never sit at this table. https://t.co/EpGZVnJPYq
— Rahul Gandhi (@RahulGandhi) November 20, 2026
బీజేపీ ఆరోపణలు
రాహుల్ చేసిన ఈ పోస్టు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అధికార బీజేపీ (BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని బీజేపీ ప్రతినిధి తుహిన్ సిన్హా ఆరోపించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన సిమ్లా ఒప్పందం సమయంలో పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను (PoWs) విడుదల చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాతే పాకిస్థాన్ భారత్‌లోకి ఉగ్రవాదాన్ని ఎగదోయడం ప్రారంభించిందని విమర్శించారు.
ఇక మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సమయంలో పాకిస్థాన్‌తో కలిసి విడుదల చేసిన షర్మ్-ఎల్-షేక్ (Sharm-el-Sheikh) సంయుక్త ప్రకటనను కూడా ప్రస్తావించారు. 2008 ఆగస్టు 7న బీజింగ్‌లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య రహస్య అవగాహన ఒప్పందం జరిగిందని చెప్పారు. ఆ తర్వాతే భారత్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లు పెరిగాయని ఆరోపించారు. 2004-14 మధ్య యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువగా రాజీపడిన ప్రభుత్వం భారత్‌లో ఎప్పుడైనా ఉందా..? అని ప్రశ్నించారు. భారత్‌ను కించపరచడానికే రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచ దేశాలన్నింటితో బలమైన సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read..
కావేరీ జలాల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
రూ.1.8 కోట్ల లోన్ ఇచ్చేందుకు రూ.9 లక్షల లంచం.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026

Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
నవంబర్ 20, 2026

Rahul Gandhi | అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం
- ●HYDRAA | అహ్మదాబాద్ కంకారియా లేక్ తరహాలో అంబీర్ చెరువు..!
- ●Damodar Rajanarasimha | వైద్య రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతం

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!

Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!

Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం



