త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rasgulla Bomb | ర‌స‌గుల్లా అని బాంబు చేతికిచ్చారు.. నోట్లోనే పేల‌డంతో వ్య‌క్తి దుర్మ‌ర‌ణం

Rasgulla Bomb | మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) డిండౌరీ జిల్లా పడారియాలో దారుణం చోటుచేసుకుంది. ర‌స‌గుల్లా అని చెప్పి నాటు బాంబు (Rasgulla Bomb) ఇవ్వ‌డంతో.. నోట్లోనే పేలి ఓ వ్య‌క్తి దుర్మ‌ర‌ణం చెందాడు.

G

National | Published On Nov 13, 2026, 8.03 am IST

Rasgulla Bomb | ర‌స‌గుల్లా అని బాంబు చేతికిచ్చారు.. నోట్లోనే పేల‌డంతో వ్య‌క్తి దుర్మ‌ర‌ణం
Advertisement

Rasgulla Bomb | త్రినేత్ర న్యూస్‌: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) డిండౌరీ జిల్లా పడారియాలో దారుణం చోటుచేసుకుంది. ర‌స‌గుల్లా అని చెప్పి నాటు బాంబు (Rasgulla Bomb) ఇవ్వ‌డంతో.. నోట్లోనే పేలి ఓ వ్య‌క్తి దుర్మ‌ర‌ణం చెందాడు. ప‌డారియాకు చేందిన రాజేంద్ర బరోటియా (Rajendra Barotiya) అనే వ్యక్తి మంగ‌ళ‌వారం రాత్రి త‌న ఇంట్లో ఉండ‌గా.. అత‌ని బంధువైన‌ రామ్‌భ‌గ‌త్ బ‌రోటియా (Ram Bhagat Barotiya) అనే వ్య‌క్తి వ‌చ్చాడు. ఇద్ద‌రు మాట్లాడుకుంటుండ‌గా.. రసగుల్లా (Rasgulla) అంటూ నాటుబాంబును రాజేంద్ర‌ చేతికి ఇచ్చాడు. అయితే చీకట్లో సరిగా కనిపించకపోవ‌డంతో రాజేంద్ర దానిని నోట్లో పెట్టుకొని కొరికాడు. వెంట‌నే భారీ పేలుడు సంభ‌వించ‌డంతో నోరంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయాడు.

‘అది జంతువులను చంపేందుకు ఉప‌యోగించే నాటుబాంబు (Country-made Bomb). పేలుడు (Explosion) శబ్దం వినగానే పరుగునవచ్చి ఇరుగుపొరు స‌హాయంతో ఆటోలో ఆయనను ద‌వాఖాన‌కు త‌ర‌లించాం. అయినా ప్రయోజనం లేకపోయింది’ అని రాజేంద్ర భార్య సుశీలా బాయి తెలిపారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని నిందితుడు రామ్ భ‌గ‌త్‌తోపాటు మ‌రొక‌రిని అదుపులోకి తీసుకున్నారు. చీక‌టిగా ఉండ‌టంతో బాంబా (Bomb) లేక ర‌స‌గుల్లానా అనే విష‌యాన్ని రాజేంద్ర గుర్తించ‌లేక‌పోయార‌ని పోలీసులు తెలిపారు. దానిని కొరికిన మ‌రుక్ష‌ణ‌మే బాంబు పేలిపోయింద‌ని చెప్పారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నామ‌ని వెల్లడించారు. కాగా, ఓ బాలుడు త‌న‌కు బాంబు ఇచ్చార‌ని రామ్ భ‌గ‌త్ పోలీసుల‌కు తెలిపారు.

Advertisement
Advertisement