Sonam Wangchuk | నేను బానే ఉన్నా.. ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతివ్వండి : ఆసుపత్రి వైద్యులకు వాంగ్‌చుక్ లేఖ
Sonam Wangchuk | కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ (Chalo Parliament) మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రి (Safdarjung Hospital) అధికారులకు ఆయన లేఖ రాశారు.
Sonam Wangchuk | కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ (Chalo Parliament) మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రి (Safdarjung Hospital)లో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్ ఇవాళ ఆసుపత్రి అధికారులకు ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని అందులో పేర్కొన్నారు. చలో సంసద్ మార్చ్‌లో పాల్గొనేందుకు వీలుగా తనను డిశ్చార్జ్ చేయాలని లేఖలో అభ్యర్థించారు. కాగా, 21 రోజుల నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని ఈనెల 18న పోలీసులు బలవంతంగా సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
వాంగ్‌చుక్.. సీజేపీ మార్చ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లు పంపారు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు, నీట్ పేపర్ లీక్ ఘటనలపై సమాధానం చెప్పాలని తన మొదటి డిమాండ్‌గా పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీక్ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు తనకు హామీ ఇవ్వాలని రెండో షరతు పెట్టారు. ఆరోగ్యం, ఇతర కారణాల వల్ల తాను ఈరోజు పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనలేకపోతే.. అగ్ర రాజకీయ నాయకులు తనను ఆస్పత్రిలో పరామర్శించి ఈ రెండు షరతులపై హామీ ఇవ్వాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మూడు షరతులతో కూడిన లేఖను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ మూడు డిమాండ్లకు అంగీకరిస్తే తాను ఇప్పుడే నిరాహార దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ ప్రకటించారు.
దీక్ష విరమించిన దిప్కే..
ఇదిలా ఉండగా.. వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను ఇవాళ విరమించారు. దీక్ష విరమించినా తమ ఆందోళనలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేసిన నేపథ్యంలో.. ఉద్యమం ఆగిపోకూడదని చెప్పి దిప్కే శనివారం తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన ముగ్గురు విద్యార్థి నేతలు ఇవాళ నిరాహార దీక్షను విరమించారు.
జేపీ నడ్డాతో సీజేపీ చర్చలు..
దీక్ష విరమించిన దిప్కే.. కేంద్రంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాతో కలిసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యేందుకు బయల్దేరి వెళ్లారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు పార్టీ వెల్లడించింది.
Also Read..
మోదీ ప్రభుత్వం బలప్రయోగంతో ప్రశ్నించే గొంతు నొక్కేస్తోంది : మల్లికార్జున ఖర్గే
ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్
యూనియన్ బ్యాంక్‌లో ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. 395 పోస్టులతో నోటిఫికేషన్
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






