త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌.. నెలాఖ‌రులోపు నివేదిక ఇవ్వండి

Supreme Court | నీట్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా (CJP Protest) విద్యార్థులపై పోలీసుల చర్యలపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న హైపవర్ కమిటీ.. తన నివేదికను నెలాఖరులోగా సమర్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.

D

National | Published On Nov 5, 2026, 5.11 pm IST

Supreme Court | విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌.. నెలాఖ‌రులోపు నివేదిక ఇవ్వండి
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : నీట్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా (CJP Protest) విద్యార్థులపై పోలీసుల చర్యలపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న హైపవర్ కమిటీ.. తన నివేదికను నెలాఖరులోగా సమర్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ నివేదిక కోసం తాము ఇంకా ఎక్కువ రోజులు వేచి ఉండలేమని స్పష్టం చేసింది. అక్టోబర్ 31న కమిటీ సమర్పించిన నివేదిక కేవలం ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలను తెలిపే స్టేటస్ రిపోర్ట్ మాత్రమేనని, పోలీసుల దౌర్జన్యాల ఆరోపణలపై ఎలాంటి నిర్దిష్టమైన అంశాలు లేవని అభిప్రాయపడింది.

ఇప్పటివరకు అందిన అన్ని పత్రాలు, సాక్ష్యాలను పరిశీలించి, సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరాలని కమిటీని ఆదేశించింది. కేవ‌లం బాధితులు స‌మ‌ర్పించిన ఫిర్యాదుల‌కే త‌మ విచార‌ణ‌ను ప‌రిమితం చేయ‌కుండా.. ఇత‌రులు అందించిన ఫిర్యాదులు, వీడియోలు, ఇత‌ర సాక్ష్యాల‌ను కూడా త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. అనంత‌రం కేసు విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 2కు వాయిదా వేసింది.

విచార‌ణ సంద‌ర్భంగా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తాపార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిర‌స‌న‌ల స‌మ‌యంలో జ‌రిగిన హింస‌, పోలీసుల అణ‌చివేత‌పై ద‌ర్యాప్తు చేయ‌డానికి సుప్రీంకోర్టు హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ (హెచ్‌పీఈసీ)ని నియ‌మించిన విష‌యం తెలిసిందే. అయితే, బాధితుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఫిర్యాదులు అంద‌లేద‌ని హైప‌వ‌ర్ క‌మిటీ విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నానికి తెలిపింది. మార్చ్ సంద‌ర్భంగా జ‌రిగిన హింస‌పై ఫిర్యాదుల‌ను ఆహ్వానిస్తూ 149 వార్తా ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చిన‌ట్లు తెలిపింది. అయినప్పటికీ ఆన్‌లైన్ లేదా నేరుగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పేర్కొంది. కాగా, సీజేపీ నేతృత్వంలో జరిగిన ఆందోళనల సమయంలో విద్యార్థి ఆందోళనకారులపై పోలీసులు అణచివేతకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గత ఆగస్టులో ఈ కమిటీ ఏర్పాటుకు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

Also Read..

UGC నిబంధ‌న‌ల‌ను పునఃప‌రిశీలిస్తాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

వెండి ధ‌ర రూ.2 ల‌క్ష‌ల‌కు చేరనుందా..? 2 రోజుల్లోనే రూ.11వేలు జంప్‌..

కొడంగల్‌కు రూ.9,100 కోట్ల అభివృద్ధి వరాలు: సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన.. ప్రాజెక్టుల పూర్తి వివరాలివే!

Advertisement
Advertisement