త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jantar Mantar | ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీఛార్జ్‌

Jantar Mantar | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం వేళ దేశ రాజ‌ధాని ఢిల్లీలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. కాక్రోచ్ పార్టీ చేప‌ట్టిన చ‌లో పార్ల‌మెంట్ మార్చ్ ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

D

National | Published On Jul 20, 2026, 12.26 pm IST

Jantar Mantar | ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీఛార్జ్‌
Advertisement

Jantar Mantar | నీట్ ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా, విద్యా వ్య‌వ‌స్థ‌లో ప్ర‌భుత్వం సంస్క‌ర‌ణలు తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) చేప‌ట్టిన‌ చ‌లో పార్ల‌మెంట్‌ (Chalo Parliament) మార్చ్ తీవ్ర‌ ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. సీజేపీ కార్య‌క‌ర్త‌లు జంత‌ర్ మంత‌ర్ (Jantar Mantar) నుంచి పార్ల‌మెంట్ వైపుకు ర్యాలీగా బ‌య‌ల్దేరారు. ఈ ర్యాలీకి అనుమ‌తి లేదంటూ నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు, నిర‌స‌న‌కారుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా భ‌ద్ర‌తా సిబ్బంది ఆందోళ‌న‌కారుల‌ను చెద‌రగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ప‌లువురిని అరెస్ట్ చేశారు.

హైఅల‌ర్ట్‌లో ఢిల్లీ..

మ‌రోవైపు సీజేపీ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మయ్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లూ జ‌ర‌గ‌కుండా ఢిల్లీ వ్యాప్తంగా భ‌ద్ర‌త‌ను పెంచారు. జంతర్ మంతర్‌తో పాటు పటేల్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, రైల్ భవన్ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ప‌లు మెట్రో స్టేష‌న్ల‌ను కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే జంత‌ర్ మంత‌ర్ స‌హా సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

Also Read..

నేను మాట్లాడేది 28 ఏళ్ల యువకుల గురించి.. రాహుల్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని విమ‌ర్శ‌లు

పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం.. వెంట‌నే లోక్‌స‌భ వాయిదా

రైతులు సుభిక్షంగా ఉండాల‌ని.. చిలుకూరు బాలాజీ దేవాలయంలో వరుణ జపం

Advertisement
Advertisement