త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | మోదీ ప్ర‌భుత్వం బ‌ల‌ప్ర‌యోగంతో ప్ర‌శ్నించే గొంతు నొక్కేస్తోంది : మ‌ల్లికార్జున ఖ‌ర్గే

Mallikarjun Kharge | కేంద్ర‌ ప్ర‌భుత్వంపై రాజ్య‌స‌భ (Rajya Sabha)లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ, నీట్ పేపర్​ లీక్​లపై మాట్లాడకుండా ప్రభుత్వ బలప్రయోగానికి దిగుతోందని, ప్ర‌శ్నించే గొంతును నొక్కేస్తోంద‌ని విమ‌ర్శించారు

D

National | Published On Jul 20, 2026, 12.58 pm IST

Mallikarjun Kharge | మోదీ ప్ర‌భుత్వం బ‌ల‌ప్ర‌యోగంతో ప్ర‌శ్నించే గొంతు నొక్కేస్తోంది : మ‌ల్లికార్జున ఖ‌ర్గే
Advertisement

Mallikarjun Kharge | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ‌మైన మొద‌టిరోజే ఉభ‌య‌స‌భ‌లు ద‌ద్ద‌రిల్లాయి. నీట్ పేప‌ర‌ల్ లీక్‌, అయోధ్య‌ రామ‌మందిరంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల చోరీ అంశాలు ఉభ‌య‌స‌భ‌ల‌ను కుదిపేస్తున్నాయి. ఆయా ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌తిప‌క్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగారు. దీంతో ఎగువ‌, దిగువ స‌భ‌ల్లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంపై రాజ్య‌స‌భ (Rajya Sabha)లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ, నీట్ పేపర్​ లీక్​లపై మాట్లాడకుండా ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని, ప్ర‌శ్నించే గొంతును నొక్కేస్తోంద‌ని విమ‌ర్శించారు. రాజ్య‌స‌భ‌లో ఖ‌ర్గే మాట్లాడుతూ.. "పేపర్ లీక్, నీట్ పరీక్షల కుంభకోణంపై మాట్లాడేందుకు నాకు అనుమతి ఇచ్చారు. నీట్​ పేపర్ లీక్ అనేది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. పిల్లల భవిష్యత్తు గురించి నేను ఇక్క‌డ మాట్లాడుతున్నాను. పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా ఈరోజు వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని నిర‌స‌న చేస్తున్నారు. ప్ర‌భుత్వం బ‌ల‌ప్ర‌యోగానికి పాల్ప‌డుతూ.. ప‌శ్నించే గొంతు నొక్కుతోంది. నిర‌స‌న‌కారుల‌ను పోలీసుల‌తో కొట్టిస్తూ.. వారిని అక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టేందుకు ప్రయత్నిస్తోంది" అని ఖ‌ర్గే వ్యాఖ్యానించారు.

Also Read..

ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీఛార్జ్‌

పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం.. వెంట‌నే లోక్‌స‌భ వాయిదా

నేను మాట్లాడేది 28 ఏళ్ల యువకుల గురించి.. రాహుల్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని విమ‌ర్శ‌లు

Advertisement
Advertisement