త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థ‌లాన్ని ఆక్ర‌మించుకోలేరు : సుప్రీంకోర్టు

Supreme Court | ఢిల్లీలో నిర‌స‌న‌ల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నిరసన (protest) తెలిపే హక్కు అందరికీ ఉంటుంద‌ని... కానీ, నిర‌స‌న‌ల పేరుతో ఒకే స్థలాన్ని ఎల్లప్పుడూ ఆక్రమించ‌లేరని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Nov 3, 2026, 1.54 pm IST

Supreme Court | నిరసనల పేరుతో ఒకే స్థ‌లాన్ని ఆక్ర‌మించుకోలేరు : సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ నిర‌స‌న‌ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నిరసనల పేరిట ఎవరూ ఒకే స్థ‌లాన్ని నిర‌వ‌ధింక‌గా ఆక్ర‌మించుకోలేర‌ని స్ప‌ష్టం చేసింది. నిరసనల కోసం కేటాయించిన నిర్దిష్ట ప్రదేశాలకు కూడా ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని అభిప్రాయ‌ప‌డింది.

గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ (Jantar Mantar), రామ్‌లీలా మైదాన్‌లో (Ramlila Maidan) నిరసన ప్రదర్శన చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నిర‌స‌న‌లపై ఢిల్లీ వ్యాపారులు స‌హా ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఆయా పిటిష‌న్ల‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని అత్యున్న‌త ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన ఆందోళనల కారణంగా ఢిల్లీలో తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఢిల్లీ వ్యాపారులు ధ‌ర్మాస‌నం ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిర‌స‌న‌ల కార‌ణంగా క‌న్నాట్ ప్లేస్‌లో షాపుల‌న్నీ మూత‌ప‌డ్డాయ‌ని, పండుగ స‌మ‌యంలో విక్ర‌యాలు జ‌ర‌గ‌క‌పోతే మా ప‌రిస్థితి ఏంటి..? అంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆందోళనలు ఇలాగే కొనసాగితే దీపావళి విక్రయాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఈ స‌మ‌స్య‌కు ఒక ప‌రిష్కారం చూపాల‌ని కోరారు. అదేవిధంగా రాబోయే రెండు నెల‌ల పాటూ ఎలాంటి నిరసనలు లేదా ధర్నాలు జరగకుండా చూడాలని కోర్టును అభ్యర్థించారు.

ఇక విచార‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చే వారే ఆ చ‌ర్య‌ల వ‌ల్ల జ‌రిగే ఎలాంటి ప‌రిణామాల‌కైనా బాధ్య‌త వ‌హించాల‌ని కోర్టుకు తెలిపారు. జులై 20 నాటి నిర‌స‌న‌ల‌కు కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చార‌ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. అయిన‌ప్ప‌టికీ నిర‌స‌న‌కారులు ఆ స్థలాన్ని 21 రోజుల‌పాటూ ఆక్ర‌మించుకోవ‌డంతోపాటూ పార్ల‌మెంటు వైపు మార్చ్ చేప‌ట్టార‌ని తెలిపారు.

వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. "నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ, నిర‌స‌న‌ల కోసం ఒకే స్థలాన్ని ఎల్లప్పుడూ ఆక్రమించ‌లేరు. అక్కడ ఇతర నిరసనకారులు కూడా ఉంటారు. రైతులు, వ్యాపారులు, జర్నలిస్టులు, న్యాయ‌వాదులు ఎక్కడికి వెళ్తారు..? నిరసనకు నిర్దిష్టమైన సమయం, కాలపరిమితి ఉండాలి" అని ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. నిరసనలకు అనుమతినిచ్చేటప్పుడు స్పష్టమైన నిబంధనలు ఉండాలని తెలిపింది. వ్యాపారుల ఆందోళ‌న‌పై కేంద్రం నుంచి స్పంద‌న కోరింది.

Also Read..

దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చ‌ర్య‌ల‌పై బాంబే హైకోర్టు ఆగ్ర‌హం

ఇండియ‌న్ నేవీ డేరింగ్ ఆప‌రేష‌న్‌.. స‌ముద్ర దొంగ‌ల ఆట‌క‌ట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం

ఒమ‌న్ తీరంలో భార‌తీయ నౌక‌పై దాడి.. గుజ‌రాత్ నావికుడు మృతి

ట్యాగ్స్:

Election Commission Of IndiaJantar MantarProtestRamlila MaidanSupreme Court
Advertisement
Advertisement