త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Bank of India | యూనియ‌న్ బ్యాంక్‌లో ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. 395 పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌

Union Bank of India | బ్యాంక్ కొలువుల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌వారికి యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ (SO Recruitment) ప్రారంభించింది.

G

National | Published On Jul 20, 2026, 1.18 pm IST

Union Bank of India | యూనియ‌న్ బ్యాంక్‌లో ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. 395 పోస్టుల‌తో నోటిఫికేష‌న్‌
Advertisement

Union Bank of India | త్రినేత్ర‌.న్యూస్‌: బ్యాంక్ కొలువుల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌వారికి యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ (SO Recruitment) ప్రారంభించింది. మొత్తం 395 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన‌వారు ఆగ‌స్టు 10 వ‌ర‌కు unionbankofindia.bank.inలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు జూలై 21 (మంగ‌ళ‌వారం) నుంచి ప్రారంభం కానున్నాయి.

మొత్తం ఖాళీలు: 395
ఇందులో మేనేజ‌ర్ 163, సీనియ‌ర్ మేనేజ‌ర్ 153, చీఫ్ మేనేజ‌ర్ 52, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ 20, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల‌ను ఎస్సీ 57, ఎస్టీ 27, ఓబీసీ 105, ఈడ‌బ్ల్యూఎస్ 36, జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు 170 చొప్పున కేటాయించారు.

అర్హ‌త‌లు: డిగ్రీ చేసి ఉండాలి. వ‌య‌స్సు, విద్యార్హ‌త‌లు ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జూలై 21
ఆన్‌లైన్ అప్లికేష‌న్లకు చివ‌రితేదీ: ఆగ‌స్టు 10
వెబ్‌సైట్‌: www.unionbankofindia.co.in

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్‌చేయండి..

Advertisement

తాజావార్తలు

Advertisement