FCRA Bill | జేపీసీకి ఎఫ్‌సీఆర్ఏ బిల్లు
FCRA Bill | విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు (FCRA Amendment Bill, 2026)పై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని వాయిస్ ఓట్ ద్వారా లోక్‌సభ ఆమోదించింది.
FCRA Bill | త్రినేత్ర.న్యూస్ : విదేశాల నుంచి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి తీసుకొచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు (FCRA Amendment Bill, 2026)పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని వాయిస్ ఓట్ ద్వారా లోక్‌సభ ఆమోదించింది. మొత్తం 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపు జేపీసీ నివేదిక ఇవ్వనుందని వెల్లడించింది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత చట్టం మైనారిటీలను లక్ష్యంగా చేసుకునేలా ఉందని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ఈ బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. "ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు మైనారిటీలకు వ్యతిరేకం కాని ఏ బిల్లును తీసుకొచ్చిందో మాకు చెప్పాలి" అని డిమాండ్ చేశారు. అఖిలేష్ వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఈ చట్టం ఏ మతానికి వ్యతిరేకం కాదని, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు, పారదర్శకతను పెంచడానికే ఈ సవరణలు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజుజు ( Kiren Rijiju) గట్టి కౌంటర్ ఇచ్చారు. చట్టపరమైన కార్యాచరణ లేకుండా విదేశీ నిధులను దేశంలోకి అనుమతించలేమన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునేలా ఎలాంటి నిబంధనలూ ఇందులో లేవని స్పష్టం చేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఒక్క అంశాన్ని చూపాలని అఖిలేష్ యాదవ్‌కి సవాల్ విసిరారు. ఈ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
Also Read..
ఒకే ఫ్లాట్‌లో 37 కుక్కలను పెంచుతున్న యువతి.. స్థానికుల ఫిర్యాదుతో హైకోర్టు సీరియస్
నాగార్జునసాగర్ నిండేదాక పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలి.. రేవంత్‌కు అలా అడిగే దమ్ముందా?
సంబంధిత వార్తలు

Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
సెప్టెంబర్ 25, 2026

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు
సెప్టెంబర్ 11, 2026

Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..



