Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ ట్రెండ్ నడుస్తోంది. ఈ ప్రాంతపు కథలు, సంస్కృతులు, యాస, భాషలతో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌కు చిరునామాగా మారిపోయాయి. తెలంగాణ జానపదాలు లేకుండా ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలు రూపొండం లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ నేటివిటీతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Sep 29, 2026, 12.09 pm IST
టాలీవుడ్‌లో సక్సెస్‌కు చిరునామాగా తెలంగాణ కథలు
తెలంగాణ యాస, భాషలతో రాబోతున్నతెలుగు సినిమాలు
Telangana Movies | తెలంగాణ నేల మట్టి కథలు, ఇక్కడి మనుషుల తండ్లాటలు... యాసలు.. పల్లెపాటలు... ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు వెండితెరపై చిన్నచూపుకు గురైన తెలంగాణ భాష...నేడు వందల కోట్ల వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. తెలంగాణ జానపదాలకు స్టార్ హీరోలు సైతం స్టెప్పులు వేస్తున్నారు. తెలంగాణ సంస్కృతులు, సంప్రదాయాలకు ప్రాముఖ్యతనిస్తూ... టైటిల్స్ నుంచి పాటలు, మాటలు...ఇలా అన్నింట తెలంగాణతనాన్ని అందంగా, అత్యంత సహజంగా ఆవిష్కరిస్తూ సినిమాలను తెరకెక్కించే ట్రెండ్ టాలీవుడ్‌లో పెరిగిపోయింది. అగ్ర హీరోలు, దర్శకులను మాత్రమే కాకుండా తెలుగు ఆడియెన్స్‌ను సైతం ఈ తెలంగాణ మేనియా ఊపేస్తోంది.
నాని ప్యారడైజ్...
ఇటీవల రిలీజైన నాని ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. అణిచివేతకు గురైన ఓ జాతి కథకు తెలంగాణ సంస్కృతిని జోడించి ప్యారడైజ్‌ను వెండితెరపై హృద్యంగా ఆవిష్కరించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలో అడుగడుగునా తెలంగాణ మూలాలు కనిపిస్తాయి. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన కేసీఆర్‌తో పాటు గిరిజనుల ఆత్మగౌరవానికి చిహ్నమైన సమ్మక్క సారక్కల ప్రస్తావన, నిజాం ఆధిపత్యపోరు, జనాపద శైలిలో సాగే పాటలతో పాటు తెలంగాణ నేలతో ముడిపడిన అనేక అంశాలతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు వస్తోన్నాయి. తాను అనుకున్న కథను వెండితెరపై చూపించిన దర్శకుడి ధైర్యానికి ఆడియెన్స్ హ్యాట్సాఫ్ చెబుతోన్నారు.
ఇడుపుకాయితం...
తెలంగాణ కథలతో రూపొందిన పలు సినిమాలు ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రియదర్శి ఇడుపుకాయితం సినిమా టైటిల్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇడుపుకాయితం అని ఈ సినిమాకు పేరు పెట్టడంపై ఆంధ్రోళ్లు చేసిన అవహేళన, చులకన మాటలకు తెలంగాణ వాదులు గట్టిగానే బదులిచ్చారు. తెలంగాణ నేపథ్య కథతో పాటు పూర్తిగా తెలంగాణ నటీనటులతోనే ఇడుపుకాయితం సినిమా తెరకెక్కుతోంది. ప్రియదర్శి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను బన్నీవాస్‌తో కలిసి అగ్ర దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత నిర్మిస్తోంది. వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రాజు వెడ్స్ రాంబాయితో తర్వాత మరోసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో హీరో అఖిల్ రాజ్ శనార్తి సినిమా చేయబోతున్నాడు. ఇడుపుకాయితంతో పాటు శనార్తి సినిమాలోనూ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ కథానాయికగా కనిపించబోతుంది. డైరెక్టర్ సంపత్‌నంది నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది.
ఎల్లమ్మ...
బలగం సినిమాలో తెలంగాణ మనుషుల్లోని మంచితనాన్ని బంధాలు, బంధుత్వాలకు వారు ఇచ్చే విలువను ఉద్వేగభరితంగా చూపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు డైరెక్టర్ వేణు ఎల్దండి. బలగం తర్వాత మరోసారి తెలంగాణ నేటివిటీతో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడు వేణు ఎల్దండి. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఓ నిమ్నజాతి కళాకారుడి జీవితంలో ఎదురైన ఆటుపోట్లతో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. అనంతిక సనీల్‌కుమార్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
క్రేజీ కళ్యాణం...
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన క్రేజీ కళ్యాణం మూవీ త్వరలో థియేటర్లలోకి రాబోతుంది. తెలంగాణ పెళ్లి వేడుక వెనుక ఉండే సరదాలు, సంతోషాలతో దర్శకుడు భద్రప్ప గాజుల ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్‌గా చూపించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్‌తో పాటు నరేష్ విజయ్ కృష్ణ, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ తెలంగాణ యాస నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పింది.
భోగి...
అనుపమ కథానాయికగా నటించిన మరో మూవీ భోగి కూడా తెలంగాణ కథతోనే తెరకెక్కుతోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిలాబాద్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. బండ్ల గణేష్ కూతురు జనని నిర్మిస్తున్న జిల్లెడు చెట్టుతో పాటు మరికొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన తెలంగాణ సినిమాలు ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Supreme Court | 9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు.. NTF సర్వేలో షాకింగ్ విషయాలు
- ●TTD | తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏయే తేదీల్లో అంటే?
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి

Supreme Court | 9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు.. NTF సర్వేలో షాకింగ్ విషయాలు

TTD | తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏయే తేదీల్లో అంటే?

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..






