Harish Rao | ఉదయ్ నాగరాజు తెలంగాణలో ఉదయించి.. లండన్‌లో వెలుగుతుండు
Harish Rao | తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ చట్టసభకు ఎన్నికైన తొలి వ్యక్తి సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశంసించారు. తెలంగాణలో ఉదయించి లండన్‌లో వెలుగుతూ తన పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చిండన్నారు.
- పల్లెలో పుట్టి పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చిండు
- తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి వ్యక్తిగా నిలిచిండు
- సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిండు
- పౌర సన్మానంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశంసలు
Harish Rao | త్రినేత్ర.న్యూస్: తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ చట్టసభకు ఎన్నికైన తొలి వ్యక్తి సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశంసించారు. తెలంగాణలో ఉదయించి లండన్‌లో వెలుగుతూ తన పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చిండన్నారు. సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారని కొనియాడారు. 47 ఏళ్ల చిన్న వయసులోనే ఇంతటి అత్యున్నత పదవి దక్కించుకోవడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో బుధవారం నిర్వహించిన ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నాగరాజును శాలువాతో ఘనంగా సత్కరించారు.

పల్లెటూరులో పుట్టి బ్రిటన్ చట్టసభకు చేరిన ఉదయ్ యువతకు ఎంతో ఆదర్శమయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యే స్థాయికి ఎదగడం వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదల ఉన్నాయి. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి అనడానికి ఉదయ్ జీవితమే ఒక ఉదాహరణ. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి మనిషిలో ఒక అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది.. దాన్ని వెలికితీసి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
లండన్‌లో ఉంటూ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు..
ఉదయ్ నాగరాజుతో తనకు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందని హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు. ఆయన వివాహానికి కూడా తాను హాజరయ్యానని, ఆయన ఎంపీ కాకముందు లండన్‌లోని వారి ఇంటికి కూడా వెళ్లానని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ మనమంతా ఎలాగైతే పోరాడామో, లండన్‌లో ఉంటూ ఉదయ్ నాగరాజు కూడా మాతృభూమి కోసం ఉద్యమానికి అంతే స్థాయిలో మద్దతు తెలిపి, తన వంతు భాగస్వామ్యం అందించారని కొనియాడారు.

ఖండాంతరాలు దాటి ఎంత ఎదిగినా ఆయన ఒదిగి ఉండే తత్వం అందరికీ ఆదర్శం అన్నారు. లండన్‌లో ఉంటున్నప్పటికీ వారి అమ్మాయి అక్కడ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోందని, వారు ఎంతో దూరంలో ఉన్నా మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా పాటిస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఎక్కడ ఎన్నికైనా ప్రజల కోసమే పనిచేస్తామని, అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం తెలంగాణ ప్రజల సొంతం అన్నారు.

మరిన్ని పదవులు పొంది గొప్ప సేవ చేయాలి..
ఉదయ్ నాగరాజుకు సన్మానం చేయడం అంటే సిద్దిపేట ప్రజలకు, తెలంగాణకే కాకుండా యావత్ భారతీయులకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో బ్రిటన్‌లో ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అక్కడి ప్రజలకు గొప్ప సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హరీశ్ రావు ఆకాంక్షించారు.
తాజావార్తలు
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం
- ●Ai Plus | పండుగ సీజన్‌కు ఏఐ ప్లస్ కొత్త గ్యాడ్జెట్లు.. రూ.9,999 నుంచి ధరలు..
- ●Supreme Court | 9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు.. NTF సర్వేలో షాకింగ్ విషయాలు
- ●TTD | తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏయే తేదీల్లో అంటే?

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..

POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష

Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Ai Plus | పండుగ సీజన్‌కు ఏఐ ప్లస్ కొత్త గ్యాడ్జెట్లు.. రూ.9,999 నుంచి ధరలు..





