Jagadeesh Reddy | నాగార్జునసాగర్ నిండేదాక పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలి.. రేవంత్‌కు అలా అడిగే దమ్ముందా?
Jagadeesh Reddy | నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తున్నారని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాల్వకు చుక్క నీరు రాకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు.
- 25 వేల క్యూసెక్కుల నీరు పోతుంటే సాగర్ ఎడమ కాల్వకు ఇంతవరకు చుక్క నీరు రాలే
- బాబు దగ్గర రేవంత్ లొంగిపోయి కుక్కలా బతుకుతున్నడు
- ఆరుతడి పంటలకు అర్థం తెలియని ఎదవలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నరు
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం
Jagadeesh Reddy | త్రినేత్ర.న్యూస్: నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తున్నారని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాల్వకు చుక్క నీరు రాకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. చంద్రబాబు నాయుడు కోసమే రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని ఆరోపించారు. బాబు దగ్గర రేవంత్ లొంగిపోయి కుక్కలా బతుకుతున్నాడని ధ్వజమెత్తారు. ఈమేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌పై ఫైరయ్యారు.
నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చెయ్యడం కాదు... దమ్ముంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చెయ్యాలని డిమాండ్ చెయ్యాలి. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తుంది. రెండు నెలలుగా గోదావరిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుని పోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు. కేసీఆర్ హయాంలో ఆనాడు శ్రీశైలం ఎగువన 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎగువ నుంచి కృష్ణకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది.

పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడు. నాగార్జున సాగర్‌లో నీళ్ళు ఉన్నప్పటికీ రైతులకు నీళ్ళు ఇవ్వమని జిల్లా మంత్రి అంటున్నారు. పాలమూరుకు మొదటి పంట పండించుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. ఈ ప్రభుత్వ దుర్మార్గానికి ఇంతవరకు ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నాగార్జున సాగర్‌కు చుక్క నీరు రాకుండా, పోతిరెడ్డిపాడుకు నీళ్ళు తరలిస్తున్నారు. 25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తుంటే.. నాగార్జున సాగర్ చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు.
బీఆర్ఎస్ మాట్లాడిన తరువాతే ఎజెండా అంశాలపై లేఖ రాశారు..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్ర చేస్తుంది. రైతులు ఆరుతడి పంటలు వేసుకోండని అంటున్నారు. ఆరుతడి పంటలకైన నీళ్లే కావాలి కదా..! తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్ట్ లపై రివ్యూ చేయాలని GRMB ఎజెండాలో పొందుపరిచారు. బీఆర్ఎస్ మాట్లాడిన తరువాత ఎజెండా అంశాలపై లేఖ రాశారు. GRMB సమావేశాన్ని బహిష్కరించాలి, లేదంటే బీఆర్ఎస్ సైనికులు పోరాటానికి సిద్ధమవుతారు.
నాగార్జున సాగర్‌కు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు. ఎడమ కాలువ కింద రైతులు పరిస్థితి దారుణంగా ఉంది.
కేసీఆర్ హయాంలో సాగర్ ఎడమ కాలువ కింద బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇచ్చాం. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. మంత్రి శ్రీధర్ బాబుకు చీము రక్తం ఉంటే సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకూడదు. చంద్ర బాబును చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు. నా ముందు మాట్లాడే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదనే GRMB ఎజెండా పొందుపరిచాడు.
ఉత్తమ్‌కు బుర్ర మోకాళ్లలో ఉంది..
ఉత్తమ్ కుమార్ రెడ్డి బుర్ర మోకాళ్లో ఉంది. తెలంగాణలో 7 ప్రాజెక్ట్ లకు TAC అనుమతులు పొందినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా.! ఆరుతడి పంటలకు అర్థం తెలియని ఎదవలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇది మన దురదృష్టం. అడ్డగోలుగా భూ దందాలతో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీగా ఉంటే.. అధికారులు రైతుల దగ్గరకు వెళ్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య ఉంటే పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఎలా పోతున్నాయి? రైతులకు నీళ్లు ఇవ్వకుండా వరుణ యాగాలు చేస్తా.. క్షుద్ర పూజలు చేస్తా అంటే ఎలా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్, బీఆర్ఎస్ నేతలు వంటెద్దు నరసింహారెడ్డి, కడారి అంజయ్య పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు




