Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
Muslim Marriages | రాష్ట్రంలో ముస్లిం వివాహాలకు (Muslim Marriages) రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేస్తూ తీసుకొచ్చిన ‘అస్సాం ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (కంపల్సరీ) రూల్స్ 2026’కు అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది.
Muslim Marriages | త్రినేత్ర న్యూస్ : అస్సాం (Assam)లో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముస్లిం వివాహాలకు (Muslim Marriages) రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించిన ‘అస్సాం ముస్లిం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (కంపల్సరీ) రూల్స్ 2026’కు (Assam Muslim Marriage Registration (Compulsory) Rules, 2026) మంత్రివర్గం (Assam Cabinet) ఆమోదం తెలిపింది.
ఈ విషయాన్ని సీఎం హిమంత బిశ్వ శర్మ అధికారికంగా ప్రకటించారు. ఇకపై ముస్లిం వివాహాలను సాంప్రదాయ 'ఖాజీలు' (Qazis) కాకుండా ప్రభుత్వ రిజిస్ట్రార్లు మాత్రమే రిజిస్టర్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. వివాహాల నమోదులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల సంఖ్య పెరిగితే దశలవారీగా మరికొంతమంది అధికారులను రిజిస్ట్రార్లు (Registrar)గా నియమిస్తామని తెలిపారు. గతంలో ముస్లిం వివాహాలను రిజిస్టర్ చేయడానికి 'ఖాజీ'లకు ఉన్న అధికారాలను ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ప్రత్యామ్నాయ వేదికపై కొంత అస్పష్టత నెలకొందని సీఎం తెలిపారు. అయితే, ఆ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారా ముస్లిం వివాహాలు సక్రమంగా నమోదయ్యేలా చూడటమే కాకుండా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, వివాహిత మహిళల హక్కులను రక్షించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త చట్టం 1935లో అమల్లోకి వచ్చిన అస్సాం ముస్లిం మ్యారేట్ అండ్ డైవర్సీ చట్టం స్థానంలో వచ్చింది. ఆ పాత చట్టం కింద రిజిస్ట్రేషన్ స్వచ్ఛందంగా ఉండేది. అయితే కొత్త చట్టం మైనర్ల వివాహానికి సంబంధించిన నిబంధనను తొలగించింది. కొత్త నిబంధనల ప్రకారం.. వివాహ సమయానికి అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. దీనివల్ల రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడం సులువవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, గతంలో ముస్లిం వివాహాలను, విడాకులను ఖాజీలు నమోదు చేసేవారు. కొత్త చట్టం ప్రకారం, ఖాజీల స్థానంలో ప్రభుత్వ సబ్-రిజిస్ట్రార్ల ద్వారానే అధికారికంగా వివాహాల నమోదు ప్రక్రియ జరుగుతుంది. వివాహం లేదా విడాకులు జరిగిన 30 రోజులలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ పత్రాలను సమర్పిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారు.
Also Read..
కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్.. ఐబీఎం ఆర్డర్‌తో భారీ లాభాల దిశగా..
యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!
- ●Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్.. ఐబీఎం ఆర్డర్‌తో భారీ లాభాల దిశగా..
- ●Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
- ●Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
- ●PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?

Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!

Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్.. ఐబీఎం ఆర్డర్‌తో భారీ లాభాల దిశగా..

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు

YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..






