Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
Canara Bank Recruitment | బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కెనరా బ్యాంక్ (Canara Bank) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice) రిక్రూట్‌మెంట్ చేపట్టింది. మొత్తం 3500 ఖాళీలతో నోటిఫికేషన్ (Canara Bank Recruitment) విడుదల చేసింది.
Canara Bank Recruitment | త్రినేత్ర న్యూస్: బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కెనరా బ్యాంక్ (Canara Bank) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice) రిక్రూట్‌మెంట్ చేపట్టింది. మొత్తం 3500 ఖాళీలతో నోటిఫికేషన్ (Canara Bank Recruitment) విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ canarabank.bank.inలో అక్టోబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకోచ్చు. వచ్చే నెల 17తో దరఖాస్తు గడువు ముగియనుంది. డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతినెల రూ.16,650 చెల్లిస్తారు. తెలంగాణలో 134, ఆంధ్రప్రదేశ్‌లో 247 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పోస్టుపేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 3500
- తెలంగాణ- 134 (ఎస్సీ 21, ఎస్టీ 9, ఓబీసీ 36, ఈడబ్ల్యూఎస్ 13, జనరల్ 55, దివ్యాంగులు 5)
- ఆంధ్రప్రదేశ్-247 (ఎస్సీ 39, ఎస్టీ 17, ఓబీసీ 66, ఈడబ్ల్యూఎస్ 24, జనరల్ 101, దివ్యాంగులు 9)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2023 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 1 మధ్య ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పది, ఇంటర్‌లో తమ స్థానిక భాషను ఒక లాంగ్వేజ్‌గా చదివి, 2026 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులవ్వాలి. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
ఎంపిక విధానం: 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా. ఇంటర్ లేదా డిప్లొమాలో 60 శాతం మార్కులు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్‌లో తమ స్థానిక భాషను ఒక లాంగ్వేజ్‌గా చదవని వారైతే.. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 1 నుంచి
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 17
వెబ్‌సైట్: www.canarabank.bank.in, https:/ / nats.education.gov.in
పూర్తి వివరాలకు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RRB NTPC | భారతీయ రైల్వేలో 5165 నాన్‌టెక్నికల్ ఉద్యోగాలు.. RRB ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల
సెప్టెంబర్ 25, 2026

CRPF | సీఆర్పీఎఫ్లో 521 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు..
సెప్టెంబర్ 23, 2026

Assam Rifles | పురుషులకు మాత్రమే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి



