త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | డీలిమిటేష‌న్‌పై చ‌ర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే లేఖ‌

Mallikarjun Kharge | నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చ‌ర్చించేందుకు త‌క్ష‌ణ‌మే అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.

D

National | Published On Aug 27, 2026, 5.09 pm IST

Mallikarjun Kharge | డీలిమిటేష‌న్‌పై చ‌ర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే లేఖ‌
Advertisement

Mallikarjun Kharge | త్రినేత్ర‌.న్యూస్ : ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చ‌ర్చించేందుకు త‌క్ష‌ణ‌మే అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే ( Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి ఆయ‌న మ‌రోసారి లేఖ రాశారు. పార్లమెంటు ప్ర‌త్యేక‌ సమావేశం జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) హింట్ ఇచ్చిన నేప‌థ్యంలో ఖ‌ర్గే స్పందించారు.

నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుతూ జులై 16న ప్ర‌ధానికి లేఖ రాసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే ప్ర‌స్తావించారు. పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశంలో అటువంటి ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టే ముందు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌ని త‌న లేఖ‌ కోరారు. డీలిమిటేషన్ వంటి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదని ఖర్గే సూచించారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఏప్రిల్ 17న స‌భ‌లో వీగిపోయిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. గ‌త సెష‌న్‌లోలాగానే ఈ బిల్లును మ‌ళ్లీ బ‌ల‌వంతంగా రుద్ద‌డానికి ప్ర‌య‌త్నించొద్ద‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం ముందు ఖ‌ర్గే మూడు ప్ర‌ధాన డిమాండ్లు ఉంచారు. లోక్‌స‌భ‌లోని ప్ర‌స్తుత 543 స్థానాల‌ను మ‌రో 25 ఏళ్ల‌పాటూ కొన‌సాగించాల‌ని, రాష్ట్రాల వారీగా ప్ర‌స్తుత సీట్ల కేటాయింపును య‌థాత‌థంగా ఉంచాల‌ని, 2029 లోక్‌స‌భ ఎన్నిక‌ల నుంచే మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మూడు అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి స్ప‌ష్టంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఖ‌ర్గే వివ‌రించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియలేదు

పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల‌పై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) హింట్ ఇచ్చారు. ఢిల్లీలో నిర్వ‌హించిన ఓ ఇంట‌ర్వ్యూలో రిజుజు మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభలు నిరవధిక వాయిదా పడినప్పటికీ, సెషన్‌ను రాష్ట్రపతి ఇంకా అధికారికంగా ముగించలేదని (ప్రోరోగ్ చేయలేదని) స్ప‌ష్టం చేశారు. 1952 నుంచి పార్లమెంటును ప్రోరోగ్ (prorogued) చేయ‌కుండానే తిరిగి స‌మావేశ‌ప‌రిచిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌ని ఈ సందర్భాలు గుర్తు చేశారు.

అయితే, పార్ల‌మెంటును ఎప్పుడు స‌మావేశ‌ప‌ర‌చాల‌నేది పూర్తిగా ప్ర‌భుత్వ నిర్ణ‌యం అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తితో పార్ల‌మెంటు స‌మావేశాల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించొచ్చ‌ని వివ‌రించారు. సమయం వచ్చినప్పుడు దీనిపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. రిజుజు వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌త్యేక సమావేశాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని ప్ర‌భుత్వం డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లుల కోసం స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ‌ప‌రిచే అవ‌కాశం ఉంద‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే లేఖ రాయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియలేదు : కిర‌ణ్ రిజిజు

నేపాల్ వ‌ర‌ద‌ల్లో 288 మంది భార‌తీయులు గ‌ల్లంతు : విదేశాంగ శాఖ‌

యూట్యూబ్‌కు పోటీ యాప్ బిలిబిలి బంపర్ ఆఫర్.. 1,000 వ్యూస్‌కు రూ.66..?

Advertisement
Advertisement