S Jaishankar | మీరు అమ్మే ఆయుధాలతో మాపై దాడి చేయొచ్చు.. మేం రష్యా చమురు కొనకూడదా..? యూరప్ దేశాలకు జైశంకర్ కౌంటర్
S Jaishankar | రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు (Russian oil) నిర్ణయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) గట్టిగా సమర్థించారు. అప్పటి మార్కెట్ పరిస్థితుల వల్లే రష్యా ముడి చమురు వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని వివరించారు. ఈ మేరకు యూరప్ దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
S Jaishankar | ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు (Russian oil) చేయడాన్ని యూరప్ కంట్రీస్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు అదుపులో ఉండేందుకు రష్యా చమురు కొనుగోలు చేయాలని స్వయంగా అమెరికానే భారత్‌కు సూచించిందని ఆయన వెల్లడించారు.
ఫిన్‌లాండ్‌లో జరిగిన ఓ సదస్సుకు జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాతో భారత్ సానుకూల వైఖరిని అవలంభిస్తోందని, సంక్షోభం ఉన్నప్పటికీ రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపుతోందన్న భావన ఐరోపాలో ఉందంటూ ఓ విలేకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జైశంకర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అప్పటి మార్కెట్ పరిస్థితుల వల్లే రష్యా ముడి చమురు వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని వివరించారు.
‘అప్పట్లో అమెరికా భారత్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించింది. చమురు మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా చమురును కొనుగోలు చేయాలని చెప్పింది. ముడి చమురు లభ్యత, ధరల ఆధారంగా మేము కొనుగోళ్లు చేస్తాం. ఆ సమయంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చమురులో ఎక్కువ భాగం రష్యాకు చెందినదే. భారత్‌కు ఎంతోకాలంగా ముడి చమురును సరఫరా చేస్తున్న పశ్చిమాసియా దేశాల క్రూడాయిల్‌ను ఐరోపా దేశాలు ఎక్కువగా కొనుగోలు చేసేవి. అందుకనే అప్పటి పరిస్థితులను బట్టి మేము దిశను మార్చుకోవాల్సి వచ్చింది’ అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఐరోపా దేశాల (European country) ద్వంద్వ వైఖరిని జైశంకర్ తీవ్రంగా ఎండగట్టారు. భారత్‌పై దాడులకు ఉపయోగించే ఆయుధాలను యూరప్ దేశాలు దశాబ్దాలుగా విక్రయిస్తున్నాయని అన్నారు. "భారత్ తయారు చేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడి జరగలేదు. కానీ ఐరోపా ఆయుధాల విషయంలో కూడా నేను అదే మాట చెప్పగలిగితే బాగుండేది. కానీ అలా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఐరోపా దేశాలు అమ్మిన ఆయుధాలతో భారత్‌పై దాడులు జరుగుతున్నా. గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది" అని జైశంకర్ చెప్పుకొచ్చారు.
Also Read..
నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
తెలంగాణ పోక్సో కేసుల చిరునామా అవుతుందేమో
యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు.. రేపు 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి
- ●KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్
- ●Mining 4.0 | సురక్షితమైన మైనింగ్ కార్యకలాపాలకు పరిశ్రమలు సహకరించాలి : MEAI చైర్మన్ వినయ్ కుమార్
- ●Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్గా మిస్ ఇండియా ఫైనలిస్ట్ - ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో

KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్

Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి

KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్






