Russian Oil Tanker | నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి
Russian Oil Tanker | నల్లసముద్రంలో (Black Sea) రష్యా చమురు ట్యాంకర్ (Russian Oil Tanker)పై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తుర్కియే (Turkey) రవాణా శాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ వెల్లడించారు.
International | Published On Mar 26, 2026, 3.15 pm IST
Russian Oil Tanker | నల్లసముద్రంలో (Black Sea) రష్యా చమురు ట్యాంకర్ (Russian Oil Tanker)పై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని తుర్కియే (Turkey) రవాణా శాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్ వెల్లడించారు. తుర్కియే కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నౌక విదేశీ జెండాతో ప్రయాణిస్తోంది. 10 లక్షల బ్యారెల్స్ ముడి చమురుతో రష్యాలోని నోవోరోస్సిస్క్ ఓడరేవు నుంచి బయల్దేరినట్లు స్థానిక మీడియా తెలిపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ నౌకపై దాడి జరిగింది.
ఇస్తాంబుల్ బోస్ఫరస్ జలసంధికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు మంత్రి తెలిపారు. ఓడను పూర్తిగా నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు పేర్కొన్నారు. ఇది డ్రోన్ దాడి కాదని, సముద్రంలోపల ప్రయాణించే మానవ రహిత నౌక ద్వారా జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఘటనా స్థలానికి అవసరమైన రక్షణ బృందాలను పంపినట్లు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
వినియోగదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు
నాన్న ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ రూ. 5 లక్షలు కాలిపోయాయి..
వదంతులు నమ్మొద్దు.. సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది: స్టీఫెన్ రవీంద్ర
సంబంధిత వార్తలు

Russian Oil Tanker | చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు నౌక యూటర్న్.. భారత్‌కు మళ్లింపు.. ఎందుకంటే?
మార్చి 18, 2026

Kamal Haasan | మిస్టర్ ప్రెసిడెంట్, మీ పని మీరు చూసుకోండి: కమలహాసన్
మార్చి 8, 2026

Scott Bessent | చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది : అమెరికా
మార్చి 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



