FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో
FIFA 2026 | మెక్సికో వేదికగా ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టయిన మెక్సికో తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 2-0తో ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన మెక్సికోకు 9వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ తొలి గోల్ అందించాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి గోల్ వేసిన ఆనందంలో మెక్సికో ఆటగాడు రౌల్ జిమెనెజ్
- దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో గెలుపు
- రెండో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను ఓడించిన దక్షిణ కొరియా
FIFA 2026 | మెక్సికో వేదికగా ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టయిన మెక్సికో తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 2-0తో ఓడించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన మెక్సికోకు 9వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ తొలి గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో రాబర్టో అల్వరాడో ఇచ్చిన క్రాస్‌ను రౌల్ జిమెనెజ్ హెడ్డర్‌గా మలిచి మరో గోల్‌ని అందించడంతో మెక్సికో ఆధిక్యం 2-0కు చేరుకుంది. మరోవైపు సౌతాఫ్రికాకు పలు అవకాశాలు వచ్చినా వాటిని గోల్ చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో గోల్స్ కంటే ఆటగాళ్ల దూకుడు అందరి దృష్టిని ఆకర్షించింది. పలుమార్లు మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిఫరీ ముగ్గురు ఆటగాళ్లకు రెడ్ కార్డులు చూపించాల్సి వచ్చింది. ప్రపంచకప్ చరిత్రలో ఓపెనింగ్ మ్యాచ్‌లో ముగ్గురు మైదానాన్ని వీడాల్సి రావడం ఇదే తొలిసారి. 49వ నిమిషంలో మెక్సికో ఆటగాడు బ్రియాన్ గుటియెర్రెజ్‌పై ఫౌల్ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు స్ఫెఫెలో సిథోల్ తొలుత మైదానం వీడగా.. 84వ నిమిషంలో థెంబా జ్వానే, మ్యాచ్ ముగింపు దశలో సీజర్ మాంటెస్ చేసిన ఫౌల్‌తో మైదానం వదిలి వెళ్లాల్సి వచ్చింది.
చెక్ రిపబ్లిక్‌పై సౌత్ కొరియా విజయం..

ప్రపంచకప్ టోర్నీలో దక్షిణ కొరియా శుభారంభం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన తమ తొలి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను 2-1 గోల్స్‌తో ఓడించి పూర్తి పాయింట్లతో సాధించింది. మెక్సికోలోని గ్వడాలజారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి. గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ ఏ జట్టు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో తొలి భాగం గోల్స్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధభాగంలో ఆట వేగం పెరిగింది. 58వ నిమిషంలో లాడిస్లావ్ గోల్ చేయడంతో చెక్ రిపబ్లిక్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎక్కువసేపు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 67వ నిమిషంలో వాంగ్ ఇన్ బోయెమ్ గోల్‌తో దక్షిణ కొరియా సమం చేసింది. వాంగ్‌కు ఇదే తొలి ఇంటర్నేషనల్ గోల్ కావడం విశేషం. మ్యాచ్ 80వ నిమిషంలో ఓ హేయాన్ గ్యూ కీలక గోల్ చేసి కొరియాను 2-1 ఆధిక్యంలో నిలబెట్టాడు. చివరి నిమిషాల్లో చెక్ రిపబ్లిక్ గోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, కొరియా గోల్‌కీపర్ ఎస్‌జీ కిమ్ అద్భుతంగా సేవ్ చేసి గోల్ అడ్డుకున్నాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న దక్షిణ కొరియా టోర్నీలో విజయంతో ఖాతా తెరిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Madras High Court | కూలాలకతీతంగా ఓటేయగలమని తమిళ ప్రజలు నిరూపించారు : మద్రాస్ హైకోర్టు
జూన్ 12, 2026

Supreme Court | మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోండి.. సివిల్ సర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్యలు..!
జూన్ 12, 2026

Koppula Eshwar | సింగరేణిని నామరూపాల్లేకుండా చేసేందుకు కుట్ర : కొప్పుల ఈశ్వర్
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!
- ●OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
- ●KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్
- ●KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
- ●Pongulet Srinivas Reddy | కాంగ్రెస్ ఓట్లను కట్ చేసే భూతమే ‘సర్’: పొంగులేటి
- ●KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్

Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!

OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్

KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్

KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్



