త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌

మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ న‌టాషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతుంది. బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావ్ హీరోగా హిట్ అండ్ ర‌న్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో న‌టాషా సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Jun 12, 2026, 4.28 pm IST

Natasha Singh | టాలీవుడ్ హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ – ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌
Advertisement

Natasha Singh |  మిస్ ఇండియా మాజీ ఫైన‌లిస్ట్ న‌టాషా సింగ్ హీరోయిన్‌గా మారింది. తెలుగులో ఓ సినిమా చేయ‌బోతుంది. టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు హీరోగా హిట్ అండ్ రన్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. సాయికృష్ణ సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్‌...

హిట్ అండ్ ర‌న్ మూవీలో హీరోయిన్‌గా న‌టాషాసింగ్ న‌టిస్తోన్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. శుక్ర‌వారం న‌టాషా సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో కంప్లీట్ మోడ్ర‌న్ లుక్‌లో ఈ మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ క‌నిపిస్తోంది. ఈ సినిమాలో సాక్షి అనే జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టాషా సింగ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

త‌మిళంలో....

హిట్ అండ్ ర‌న్ మూవీతోనే ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. గ‌తంలో త‌మిళంలో జిప్సీతో పాటు మ‌రో సినిమా చేసింది. హిట్ అండ‌ర్ ర‌న్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ట. ఓ మ‌ర్డ‌ర్ కేసు చిక్కుముడిని జ‌ర్న‌లిస్ట్‌తో క‌లిసి ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడు అనే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

బ్ర‌హ్మాజీ త‌న‌యుడు...

హిట్ అండ్ ర‌న్ మూవీలో కిరిటీ దామ‌రాజు, మురళీధ‌ర్ గౌడ్‌, ర‌వి ప్ర‌కాష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. ఈ సినిమాకు ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ అందించాడు. హిట్ అండ్ ర‌న్ కంటే ముందు బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు ఓ పిట్ట క‌థ‌, స్ల‌మ్ డాగ్ హ‌జ్బెండ్ సినిమాల్లో హీరోగా న‌టించాడు.

 

Advertisement
Advertisement