త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mining 4.0 | సురక్షితమైన మైనింగ్ కార్య‌క‌లాపాల‌కు ప‌రిశ్ర‌మ‌లు స‌హ‌క‌రించాలి : MEAI చైర్మ‌న్ వినయ్ కుమార్

Mining 4.0 | మైనింగ్ రంగంలో వృత్తిపరమైన నైపుణ్యం, సాంకేతిక పురోగతిని పెంపొందించడంలో మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాత్ర కీల‌క‌మ‌ని MEAI చైర్మ‌న్ వినయ్ కుమార్ అన్నారు.

D

Telangana | Published On Jun 12, 2026, 4.49 pm IST

Mining 4.0 | సురక్షితమైన మైనింగ్ కార్య‌క‌లాపాల‌కు ప‌రిశ్ర‌మ‌లు స‌హ‌క‌రించాలి : MEAI చైర్మ‌న్ వినయ్ కుమార్
Advertisement

Mining 4.0 | మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MEAI) ఆధ్వ‌ర్యంలో మైనింగ్ 4.0 జాతీయ సదస్సు నిర్వ‌హించారు. “మైనింగ్ 4.0 - సురక్షితమైన, స్థిరమైన మైనింగ్ కార్యకలాపాల కోసం అధునాతన సాంకేతికతలు” పేరిట రెండు రోజుల‌పాటూ (జూన్ 12, 13) నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మం తొలి రోజు విజ‌య‌వంతంగా పూర్తైంది.

నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మైనింగ్ నిపుణులు (mining professionals), పరిశ్రమల అధినేతలు (industry leaders), సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. మైనింగ్ పరిశ్రమలో భద్రతను పెంపొందించడం, పర్యావరణానికి హాని కలగకుండా స్థిరమైన మైనింగ్ పద్ధతులను అవలంబించడం, సుస్థిర అభివృద్ధి కోసం డిజిటల్ టెక్నాలజీలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి ఆధునిక సాంకేతికతల వినియోగంపై ప్రధానంగా చర్చించారు.

మైనింగ్ రంగంలో వృత్తిపరమైన నైపుణ్యం, సాంకేతిక పురోగతిని పెంపొందించడంలో మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాత్ర కీల‌క‌మ‌ని MEAI చైర్మ‌న్ వినయ్ కుమార్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐఓటీ (IoT), రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్, జియోస్పేషియల్ టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ అనలిటిక్స్ వంటి సాంకేతికతల ద్వారా 'మైనింగ్ 4.0' మైనింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని నొక్కి చెప్పారు. సురక్షితమైన, సమర్థవంతమైన మైనింగ్ కార్యకలాపాలను నిర్మించడానికి పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మైనింగ్ 4.0 అనేది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాద‌ని, దానిని మరింత ఉన్నతీకరించడమేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రమాదకర ప్రాంతాల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించడం, ఇండస్ట్రియల్ IoT, స్మార్ట్ సెన్సార్లు, ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారా సామర్థ్యాన్ని పెంచడమే మైనింగ్ 4.0 ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. యంత్రాలు సజావుగా పనిచేసేలా, పర్యావర‌ణానికి న‌ష్టం క‌ల‌గ‌కుండా, అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి కార్మికుడు ప‌నిముగించుకొని సురక్షితంగా ఇంటికి చేరుకునేలా గనులను నిర్మించడమే దీని లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మైనింగ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌లుగురు ప్ర‌ముఖుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు.

 

Also Read..

టాలీవుడ్ హీరోయిన్‌గా మిస్ ఇండియా ఫైన‌లిస్ట్ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌

కూలాల‌క‌తీతంగా ఓటేయ‌గ‌ల‌మ‌ని త‌మిళ‌ ప్ర‌జ‌లు నిరూపించారు : మద్రాస్ హైకోర్టు

ఆ 8 ఎక‌రాల్లో 6000 ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించాలి

Advertisement
Advertisement