KTR | దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకోం.. డీలిమిటేషన్ బిల్లుపై కేటీఆర్
KTR | డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేసే.. ఊరుకోం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేసే.. ఊరుకోం అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
జూలై నెల నుంచి డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నది అంటున్నారు. ఎవరు ఎక్కడ, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో ఎవరికీ తెలియదు. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ జరగకున్నా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సి ఉంది. కనీసం ఇక్కడైనా డీలిమిటేషన్ జరుగుతుంది అన్న సమాచారం నాకు ఉన్నది. జమిలి ఎన్నికలు ఉండకపోవచ్చు అని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో పార్లమెంట్ స్థానాలు పెంచాలన్న అంశం పైన ఇప్పటిదాకా సమాచారం లేదు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఏ ప్రతిపాదన పైన అయినా పార్టీ తన అభిప్రాయం చెప్తుంది. ఇప్పుడు ఉన్న దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్‌కి మద్దతు ఇస్తాం. దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోము. ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే దేశంలో అస్థిరతకు దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా కేంద్రం చూసుకోవాలి. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రజలతో కలిసి గొంతు విప్పుతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
తాజావార్తలు
- ●Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!
- ●Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
- ●Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..
- ●Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు
- ●Harish Rao | గుర్తు పెట్టుకో రేవంత్.. నీకు డిపాజిట్లు కూడా రావ్
- ●TG ICET 2026 | టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల.. మెరిసిన అమ్మాయిలు

Retail Inflation | ఇంధన ధరల ప్రభావం.. పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..!

Danam Nagender | 'దానం' కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!

Inflation | ద్రవ్యోల్బణం మరింత పైకి.. టమాటా, బంగారం ధరలే ప్రధాన కారణం..

Samyuktha | టాలీవుడ్ లక్కీయెస్ట్ హీరోయిన్గా మలయాళ బ్యూటీ - నాలుగేళ్లలో ఆరు హిట్లు





