KTR | వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేవు.. ఒంటరి పోరే.. తేల్చిచెప్పిన కేటీఆర్
KTR | వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తుల్లేవు.. ఒంటరి పోరే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీదే విజయం అని ఆయన దీమా వ్యక్తం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తుల్లేవు.. ఒంటరి పోరే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీదే విజయం అని ఆయన దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్‌దే విజయం. భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తాం. ఇప్పటికే పలు సర్వేలు ఇదే మాట చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడో స్థానంలోనే ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలు, హామీల పైన మోసమే వారిని మూడో స్థానానికి నెట్టింది. కాంగ్రెస్ పార్టీ జారుడు బల్ల పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా కిందికి దిగజారిపోతూనే ఉంటుంది కానీ పైకి రాదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మాకు ఒంటరి పోరాటమే కలిసొచ్చింది..
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేశాము. ఒంటరి పోరాటం మాకు కలిసి వచ్చింది. ప్రతిసారి ప్రజలు ఆశీర్వదించారు. మొన్నటి ఎన్నికల్లోనూ అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు రోజుకీ దిగజారుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నది..
గత పాలనలో ప్రజలకు మా పైన కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నది. ప్రజలు సూచించిన లోపాలను సరిచేసుకొని ముందుకు పోతున్నాం. ఆత్మపరిశీలన చేసుకున్నాం. పార్టీ నాయకత్వం నుంచి కింది కార్యకర్త వరకు ప్రతి ఒక్కరం ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు పోతున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
- ●Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..
- ●BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!
- ●Anirudh - Kavya Maran | నవంబర్లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం
- ●PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!
- ●Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం - మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం
- ●SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?

Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..

BCCI | బీసీసీఐ సెలక్టర్ రేసులో వసీం జాఫర్.. చీఫ్ సెలక్టర్ పీఠంపై ఉత్కంఠ!

Anirudh - Kavya Maran | నవంబర్లో అనిరుధ్, కావ్యమారన్ వివాహం - ప్రముఖులకు ఆహ్వానం

PM-AJAY Scheme Adarsh Grams | పీఎం-అజయ్ పథకం ఘనత: 18,093 ఆదర్శ గ్రామాలు.. పూర్తయిన విద్యార్థి హాస్టళ్లు ఇవే!





