Panneerselvam | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
Panneerselvam | అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (AIADMK) బహిష్కృత నేత పన్నీర్ సెల్వం (Panneerselvam) అధికార డీఎంకేలో చేరారు.
Panneerselvam | అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (AIADMK) బహిష్కృత నేత పన్నీర్ సెల్వం (Panneerselvam) అధికార డీఎంకేలో చేరారు. ఇవాళ ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే ( DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకు పార్టీ కండువా కప్పి స్టాలిన్ తన పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా పన్నీర్ సెల్వంకు పేరుంది. ఆయితే, జయలలిత మరణం అనంతరం ఏఐఏడీఎంకేలో నాయకత్వ పోరు మొదలైంది. ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), పన్నీర్‌సెల్వం మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ పోరులో పన్నీర్ సెల్వంపై మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నెగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన అధికార పార్టీలో చేరడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read..
వాహనదారులకు అలర్ట్.. త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్..!
కాబూల్‌పై భీకర దాడులు.. యుద్ధం మొదలైందంటూ పాక్ కీలక ప్రకటన
ఏఐ దెబ్బకు భారీగా ఉద్యోగుల కోత.. 4వేల మందిని తొలగించనున్న జాక్ డోర్సీ బ్లాక్ కంపెనీ..!
సంబంధిత వార్తలు

Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
జులై 6, 2026

Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
జూన్ 23, 2026

CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్.. వీడియో వైరల్
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



