Block Layoffs | ఏఐ దెబ్బకు భారీగా ఉద్యోగుల కోత.. 4వేల మందిని తొలగించనున్న జాక్ డోర్సీ బ్లాక్ కంపెనీ..!
Block Layoffs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ ప్రభావంతో గ్లోబల్ టెక్ పరిశ్రమలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ మాజీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నేతృత్వంలోని ఈ ఫిన్‌టెక్ దిగ్గజం దాదాపు సగం మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. దాదాపుగా నాలుగువేల మందిపైగా ఉద్యోగాలను కోల్పోనున్నారు.
Block Layoffs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ ప్రభావంతో గ్లోబల్ టెక్ పరిశ్రమలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్లాక్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ మాజీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ నేతృత్వంలోని ఈ ఫిన్‌టెక్ దిగ్గజం దాదాపు సగం మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. దాదాపుగా నాలుగువేల మందిపైగా ఉద్యోగాలను కోల్పోనున్నారు. సంస్థ చరిత్రలో ఇదొక అత్యంత కఠిన నిర్ణయమని డోర్సీ పేర్కొన్నారు. అయితే, కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ తొలగింపులు చేపట్టడం అందరినీ షాక్‌కు గురి చేస్తున్నది. గ్రాస్ ప్రాఫిట్ పెరుగుతోందని, లాభాలు సైతం మెరుగవుతున్నాయని డోర్సీ తెలిపారు. అయితే, సంస్థ అభివృద్ధి చేసి వినియోగిస్తున్న ఇంటెలిజెన్స్ టూల్స్ పని విధానాన్ని పూర్తిగా మార్చేశాయని తెలిపారు. చిన్న బృందాలే మరింత సమర్థవంతంగా, ఫలితాల ఆధారంగా పని చేయగలుగుతున్నాయని వివరించారు. ఈ మార్పును స్వీకరించడంలో బ్లాక్ ఆలస్యం చేయలేదని, చాలా కంపెనీలు ఈ విషయంలో వెనుకపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంపెనీలో పదివేలమందికిపైగా ఉద్యోగులు ఉండగా, కోతల తర్వాత అది 6వేలకు తగ్గనున్నది.
అయితే, పలుసార్లు ఉద్యోగాల్లో కోతలు విధించడం వల్ల ఉద్యోగుల మనోభావాలతో పాటు కస్టమర్స్ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావించిన సంస్థ ఒకేసారి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యే ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు సెవరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. 20వారాల జీతంతో పాటు పని చేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా మరోవారం జీతం చెల్లిస్తుంది. మే నెలాఖరు వరకు వెస్టెడ్ ఈక్విటీ, ఆరు నెలల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కొనసాగిస్తామని, కంపెనీ ఇచ్చిన డివైజెస్ ఉద్యోగులు తమ వద్దే ఉంచుకునే అవకాశం ఇచ్చింది. అంటే కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్స్ ఇతర డివైజెస్ వారి వద్దనే ఉంచుకోవచ్చని చెప్పింది. సాధారణంగా ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగించిన సమయంలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ తదితర టూల్స్‌ని కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది.
అయితే, బ్లాక్ సంస్థ ఆ నిబంధనను సడలించింది. కొత్తగా ఉద్యోగం వెతుక్కోవడం, మార్పులను ఎదుర్కోవడం, వ్యక్తిగత ఖర్చులు తదితర అవసరాలకు తోడ్పడేలా కంపెనీ నిర్ణయంతో ప్రభావితమయ్యే వారికి అదనంగా 5వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని సైతం అందించనున్నది. అమెరికా వెలుపల పని చేసే ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా సమానంగా సహాయం చేస్తామని తెలిపింది. సాధారణంగా ఉద్యోగాల కోతల సమయంలో వెంటనే సిస్టమ్ యాక్సెస్ నిలిపివేస్తారు. అయితే, బ్లాక్ మాత్రం పసిఫిక్ సమయానుసారంగా గురువారం సాయంత్రం వరకు స్లాక్, ఈ-మెయిల్స్ యాక్సెస్‌ను కొనసాగించింది. దాంతో సహచరులతో పాటు సెండాఫ్ చెప్పుకునేందుకు అవకాశం ఇస్తుందని సంస్థ పేర్కొంది. డోర్సీ స్వయంగా లైవ్ వీడియో ద్వారా ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
2009లో స్క్వేర్‌గా ప్రారంభమైన ఈ సంస్థ 2021లో బ్లాక్‌గా తన పేరును మార్చుకుంది. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సంస్థకు భారీ ఆర్థిక భారం కానుంది. ఉద్యోగాల కోతలు, సెవరెన్స్ ప్యాకేజీలు, ఈక్విటీ చెల్లింపులు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు తదితర అంశాలపై కలిపి సుమారు 450 నుంచి 500 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగులకు ప్రకటించిన 20 వారాల జీతం, సేవా సంవత్సరాల ప్రకారం అదనపు చెల్లింపులు, మే నెలాఖరు వరకు వెస్టెడ్ ఈక్విటీ, ఆరు నెలల ఆరోగ్య బీమా, అదనంగా 5 వేల డాలర్ల సహాయం అన్నీ ఈ వ్యయంలో భాగం కానున్నాయి. ఇక సంస్థలు కొనసాగే ఉద్యోగులు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగాల్సి ఉంటుందని, భవిష్యత్‌లో ప్రతి కంపెనీ కార్యకలాపాలు
ఇకపై సంస్థలో కొనసాగే ఉద్యోగులు కొత్త వ్యూహంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి సంస్థ కార్యకలాపాల్లోనూ, ఉత్పత్తుల రూపకల్పనలోనూ ఇంటెలిజెన్స్ కేంద్రబిందువుగా మారుతుందని డోర్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు. సంప్రదాయ విధానంలో కంపెనీలు ఫీచర్లు అభివృద్ధి చేసి వినియోగదారులకు అందించే మోడల్ క్రమంగా మారుతోందన్నారు. ఇకపై సంస్థల సాంకేతిక సామర్థ్యాలను నేరుగా వినియోగించుకునే అవకాశాన్ని కస్టమర్లకే కల్పించే దిశగా మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. అంటే, వినియోగదారులే తమ అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లు, సేవలను స్వయంగా రూపొందించుకునే విధంగా ప్లాట్‌ఫారమ్‌లు అభివృద్ధి చెందుతాయని వివరించారు. భవిష్యత్తులో కంపెనీలు ఉత్పత్తుల విక్రయానికి మాత్రమే పరిమితం కాకుండా, వినియోగదారులే సృష్టికర్తలుగా మారే వేదికలను అందించే దిశగా రూపాంతరం చెందుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also :
Driving license | వాహనదారులకు అలర్ట్.. త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్..!
Pakistan-Afghanistan War | కాబూల్‌పై భీకర దాడులు.. యుద్ధం మొదలైందంటూ పాక్ కీలక ప్రకటన
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






