Driving license | వాహనదారులకు అలర్ట్.. త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్..!
Driving license | దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Driving license | దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి, బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ట్రాఫిక్ నిబంధనలను (traffic violations) ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు వంటి కఠిన నిబంధనలు ఇందులో ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెల్లడించారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ (Category based driving license) గురించి ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా మన దేశంలో ఏటా 1.8 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడటం, అధిక వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, సిగ్నళ్లను పట్టించుకోకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. చట్టం అంటే ప్రజల్లో భయంగానీ, గౌరవంగానీ లేకుండా పోయిందని ఈ సందర్భంగా గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్‌ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు.
ఈ విధానం ప్రకారం.. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తే కొన్ని పాయింట్లు కోత పెడతారు. అలా వారికి ఉన్న పాయింట్లన్నీ అయిపోతే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలపాటూ సస్పెన్స్ చేస్తారు. లేదంటే ఒక్కోసారి లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
Also Read..
Pakistan-Afghanistan War | కాబూల్‌పై భీకర దాడులు.. యుద్ధం మొదలైందంటూ పాక్ కీలక ప్రకటన
Suryakumar Yadav | వీడియో అనలిస్టు సూచనలు బాగా పనిచేశాయి: సూర్యకుమార్ యాదవ్
సంబంధిత వార్తలు

E100 Fuel India | పెట్రోల్ కష్టాలకు చెక్.. ఇక మార్కెట్లోకి 100 శాతం ఇథనాల్.. తక్కువ ధరకే లభ్యం
జూన్ 14, 2026

Nitin Gadkari | పెట్రోల్, డీజిల్‌కు కాలం చెల్లినట్లేనా..? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నితిన్ గడ్కరీ..!
మే 23, 2026

Nitin Gadkari | తెలంగాణ రవాణా శాఖ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు భేష్.. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రశంస
మే 7, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



