త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజ‌య్‌.. వీడియో వైర‌ల్‌

CM Vijay | త‌మిళ‌నాడు అసెంబ్లీలో (amil Nadu Assembly) ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. డీఎంకే అధినేత‌, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను విజ‌య్ ఇమిటేట్ చేశారు. త‌న ప్ర‌సంగం ముగిసింద‌ని చెప్తూ.. చేతితో సంజ్ఞ‌ చేశారు.

D

National | Published On Jun 23, 2026, 2.33 pm IST

CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజ‌య్‌.. వీడియో వైర‌ల్‌
Advertisement

CM Vijay | త‌మిళ‌నాడు అసెంబ్లీలో (amil Nadu Assembly) ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన విజ‌య్‌ (CM Vijay).. ప్ర‌తిప‌క్ష డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా డీఎంకే అధినేత‌, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin)ను విజ‌య్ ఇమిటేట్ చేశారు. త‌న ప్ర‌సంగం ముగిసింద‌ని చెప్తూ.. చేతితో సంజ్ఞ‌ చేశారు. టీవీకే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బల్లలు చరుస్తూ సీఎం విజయ్‌కి మద్దతు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌తో పొత్తు చ‌ర్చ‌లు విజ‌య‌వంతంగా ముగిశాయ‌ని చెప్ప‌డానికి స్టాలిన్ ఇలాంటి సంజ్ఞే చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ ఎన్నిక‌ల్లో స్టాలిన్‌పై విజ‌యం సాధించిన టీవీకే నేత వీఎస్ బాబు కూడా ఇదే ఇమిటేట్ చేసి తెగ వైర‌ల్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీలో స్టాలిన్‌కు కౌంట‌ర్‌గా విజ‌య్ అదే సంజ్ఞ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Advertisement
Advertisement