Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
Udhayanidhi Stalin | ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ" రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటూ సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేశారు.
Udhayanidhi Stalin | ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ" రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటూ సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడం వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారని విజయ్ అనడం.. రైతులను అవమానించడమేనని ఉదయనిధి పేర్కొన్నారు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టారు.
"అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సమాధానం ఇచ్చే నెపంతో ముఖ్యమంత్రి స్క్రిప్ట్ ప్రకారం విమర్శలు గుప్పిస్తూ ఒకరకమైన నటన ప్రదర్శించారు. ప్రతిపక్షాల జోక్యం లేకుండా.. అసెంబ్లీ లైవ్ కెమెరాను సినిమా కెమెరాలాగా భావించి సింగిల్ టేక్‌లో షూట్ చేయడం అసెంబ్లీ స్పీకర్‌కు తగదు. ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానంలో కేవలం ఆధారాలు లేని ఆరోపణలు, సినిమా పంచ్ డైలాగులు మాత్రమే ఉన్నాయి తప్ప.. విద్యుత్ కోతలు, రైతుల సమస్యలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రణాళికల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.
ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడం వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారని అనడం ద్వారా ఆయన రైతులను అవమానించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఒక చిన్న కథ చెప్తున్నానంటూ ఆయన చేసిన ప్రకటన రైతుల గౌరవానికి పూర్తిగా భంగం కలిగించేలా ఉంది. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ తమిళనాడు మొత్తానికి తెలుసు. కాబట్టి కనీసం ఇప్పటికైనా దీని గురించి మర్చిపోండి. ముఖ్యమంత్రి హోదాకు తగినట్లుగా ప్రవర్తించాలి" అని ఉదయనిధి తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది.
కాగా, 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఇక ఇవాళ ఉదయం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం విజయ్‌పై ఉదయనిధి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీని షూటింగ్ స్పాట్‌గా మార్చేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కూడా తన నటన కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. సభ సాగుతున్న తీరు చూస్తుంటే చట్టసభలా కాకుండా షూటింగ్ స్పాట్‌లా అనిపిస్తోందని మండిపడ్డారు. రేపటి నుంచి సీఎం కోసం అసెంబ్లీ ప్రాంగణానికి కారవాన్లు, మేకప్ మ్యాన్లు, ఫైట్ మాస్టర్లు కూడా వచ్చేలా ఉన్నారంటూ ఎగతాళిగా మాట్లాడారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రీల్స్, సినిమా డ్రామాలతో కాలక్షేపం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
சட்டப்பேரவையில் ஆளுநர் உரைக்கு பதிலுரை என்ற பெயரில் scripted அவதூறுகளை அள்ளிவீசி acting performance காட்டி இருக்கிறார் முதலமைச்சர்.
பேரவையின் live Camera-வை, சினிமா camera என்று நினைத்துக் கொண்டு அவர் பேச, அதனை எதிர்க்கட்சிகளின் குறுக்கீடுகள் இன்றி single take-இல் shoot செய்ய… pic.twitter.com/54XX1k929L
— Udhay (@Udhaystalin) June 23, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్.. వీడియో వైరల్
జూన్ 23, 2026

CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం
జూన్ 23, 2026

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? – సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Titabar Mariani Railway Incident | పట్టాలపైకి వచ్చిన ఏనుగుల మంద.. ఎమర్జెన్సీ బ్రేకులతో పెను ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలట్లు!
- ●Minister Seethakka | గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి సీతక్క
- ●Stock Markets | గణాంకాల తగ్గుదల ఎఫెక్ట్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..
- ●Rabi Paddy Procurement Target | తెలంగాణ రైతులకు అదిరిపోయే వార్త: కేంద్రంపై ఒత్తిడి పెంచిన మంత్రులు.. అసలేం కోరారంటే?
- ●Mrunal Thakur | కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్ - కల నిజమైందంటూ ఎమోషనల్ పోస్ట్
- ●MLC Patnam Mahender Reddy | ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పట్నం

Titabar Mariani Railway Incident | పట్టాలపైకి వచ్చిన ఏనుగుల మంద.. ఎమర్జెన్సీ బ్రేకులతో పెను ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలట్లు!

Minister Seethakka | గ్రామీణ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి సీతక్క

Stock Markets | గణాంకాల తగ్గుదల ఎఫెక్ట్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..

Rabi Paddy Procurement Target | తెలంగాణ రైతులకు అదిరిపోయే వార్త: కేంద్రంపై ఒత్తిడి పెంచిన మంత్రులు.. అసలేం కోరారంటే?



