త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assam Rifles | అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్ర‌వాదులు కాల్పులు.. జ‌వాను వీర‌మ‌ర‌ణం

Assam Rifles | మ‌య‌న్మార్ (Myanmar) స‌రిహ‌ద్దు స‌మీపంలో అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బృందంపై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ జ‌వాను వీర‌మ‌ర‌ణం పొంద‌గా.. మ‌రో న‌లుగురు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Sep 29, 2026, 4.41 pm IST

Assam Rifles | అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్ర‌వాదులు కాల్పులు.. జ‌వాను వీర‌మ‌ర‌ణం
Advertisement

Assam Rifles | త్రినేత్ర న్యూస్ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో (Arunachal Pradesh) ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. చంగ్లాంగ్ (Changlang) జిల్లాలో మ‌య‌న్మార్ (Myanmar) స‌రిహ‌ద్దు స‌మీపంలో అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బృందంపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ జ‌వాను వీర‌మ‌ర‌ణం పొంద‌గా.. మ‌రో న‌లుగురు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

ఇండో-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో ప్ర‌స్తుతం పెన్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం 6:30 గంట‌ల ప్రాంతంలో అక్క‌డ సాధార‌ణ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న 21వ అస్సాం రైఫిల్స్ ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ దాడిలో 42 ఏళ్ల జ‌వాను హ‌వల్దార్ జాన్ఖోకై కుకి ప్రాణాలు కోల్పోయారు. గాయ‌ప‌డిన జ‌వాన్ల‌ను చికిత్స నిమిత్తం మిలిట‌రీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌య్యారు. ఈ ప్రాంతంలో భారీగా మోహ‌రించి భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఉగ్ర‌వాదుల కోసం ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఎన్ఎస్‌సీఎన్ (కే-వైఏ) అనే ఉగ్ర‌వాద సంస్థ ఈ కాల్పులు జ‌రిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Also Read..

నెహ్రూ నుంచి మోదీ వ‌ర‌కూ.. అన్ని ప్ర‌భుత్వాలూ ముస్లింల‌ను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ

ట్రాప్ షూటింగ్‌లో రజతం.. మెరిసిన భార‌త జోడీ..

కొడంగ‌ల్ బిడ్డ‌నంటూ అక్క‌డి ఇండ్ల‌నే కూల్చేస్తవా రేవంత్‌?

Advertisement
Advertisement