త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assam Rifles | పురుషులకు మాత్ర‌మే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నిక‌ల్‌, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..

Assam Rifles | దేశంలోని భ‌ద్ర‌తా ద‌ళాల్లో అత్యంత పురాత‌న, ఇండో-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌హించే అస్సాం రైఫిల్స్ (Assam Rifles) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On Sep 22, 2026, 7.57 am IST

Assam Rifles | పురుషులకు మాత్ర‌మే.. అస్సాం రైఫిల్స్‌లో టెక్నిక‌ల్‌, ట్రేడ్స్‌మ్యాన్ ఉద్యోగాలు..
Advertisement

Assam Rifles | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోని భ‌ద్ర‌తా ద‌ళాల్లో అత్యంత పురాత‌న, ఇండో-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌హించే అస్సాం రైఫిల్స్ (Assam Rifles) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వారెంట్ ఆఫీస‌ర్ (Warrant Officer), రైఫిల్‌మ్యాన్ (Rifleman) స‌హా మొత్తం 18 విభాగాల్లో 354 పోస్టులకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు. ఆస‌క్తి క‌లిగిన‌వారు అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ assamrifles.gov.inలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సెప్టెంబ‌ర్ 28 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌వుతాయి. ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్ (PST), ఫిజిక‌ల్ ఎఫిసియన్సీ టెస్ట్ (PET), కంప్యూట‌ర్ ఆధారిత రాత‌ప‌రీక్ష (CBT), ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

మొత్తం పోస్టులు: 354
ఇందులో వారంట్ ఆఫీస‌ర్ 129, రైఫిల్‌మ్యాన్ 203, హ‌విల్దార్ 6, రైఫిల్‌మ్యాన్ స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్ 16 చొప్పున ఉన్నాయి.
అర్హ‌త‌లు: పోస్టును బ‌ట్టి వేర్వేరుగా ఉన్నాయి. ప‌దోత‌ర‌గ‌తి, మ్యాథ్స్‌, ఫిజిక్స్ ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలి. అభ్య‌ర్థులు 2026 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కుల‌వ్వాలి.

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్ (PST), ఫిజిక‌ల్ ఎఫిసియన్సీ టెస్ట్ (PET), కంప్యూట‌ర్ ఆధారిత రాత‌ప‌రీక్ష (CBT), ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్లు ప్రారంభం: సెప్టెంబ‌ర్ 28 నుంచి
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 28
రిక్రూట్‌మెంట్ ర్యాలీ: న‌వంబ‌ర్ 23 నుంచి
వైబ్‌సైట్‌: assamrifles.gov.in

Advertisement
Advertisement