Light Flip | 5జి స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయం.. లైట్ ఫ్లిప్ ఫోన్ లాంచ్.. అడిక్షన్ తగ్గించుకోవడం ఈజీ..
Light Flip | స్మార్ట్‌ఫోన్‌ల వల్ల పెరుగుతున్న డిజిటల్ వ్యసనానికి ప్రత్యామ్నాయంగా డిస్ట్రాక్షన్-ఫ్రీ డివైస్‌లను అందిస్తున్న లైట్ కంపెనీ తన కొత్త లైట్ ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. సంప్రదాయ క్లామ్‌షెల్ (ఫ్లిప్) ఫోన్ డిజైన్‌ను ఆధునిక సాంకేతికతతో మేళవించిన ఈ డివైస్ సోషల్ మీడియా, అల్గోరిథమ్‌లు, అవసరం లేని యాప్‌లకు దూరంగా ఉండాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది.
Technology | Published On Jul 22, 2026, 1.50 pm IST
Light Flip | స్మార్ట్‌ఫోన్‌ల వల్ల పెరుగుతున్న డిజిటల్ వ్యసనానికి ప్రత్యామ్నాయంగా డిస్ట్రాక్షన్-ఫ్రీ డివైస్‌లను అందిస్తున్న లైట్ కంపెనీ తన కొత్త లైట్ ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. సంప్రదాయ క్లామ్‌షెల్ (ఫ్లిప్) ఫోన్ డిజైన్‌ను ఆధునిక సాంకేతికతతో మేళవించిన ఈ డివైస్ సోషల్ మీడియా, అల్గోరిథమ్‌లు, అవసరం లేని యాప్‌లకు దూరంగా ఉండాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం నాసిరకం ఫీచర్ ఫోన్‌లతో విసిగిపోయిన వారు, అలాగే స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలవుతున్న వినియోగదారులకు మెరుగైన ప్రత్యామ్నాయంగా లైట్ ఫ్లిప్‌ను తీసుకొచ్చింది. ఇందులో కంపెనీ అభివృద్ధి చేసిన లైట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇందులో సోషల్ మీడియా అల్గోరిథమ్‌లు, వెబ్ బ్రౌజర్‌లు, అనవసర యాప్‌లు ఉండవు. అవసరమైన ఫీచర్‌లను మాత్రమే అందించేలా దీనిని రూపొందించారు.
ఉపయోగపడే సౌకర్యాలు మాత్రమే..
లైట్ ఫ్లిప్‌లో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే పలు సౌకర్యాలు ఉన్నాయి. ప్రిడిక్టివ్ టి9 టైపింగ్, వాయిస్-టు-టెక్స్ట్, ఆడియో మెసేజింగ్, తొమ్మిది స్పీడ్ డయల్ షార్ట్‌కట్‌లు వంటి కమ్యూనికేషన్ ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అలారం, క్యాలిక్యులేటర్, క్యాలెండర్, డైరెక్టరీ, డైరెక్షన్స్, హాట్‌స్పాట్, మ్యూజిక్, నోట్స్, వాయిస్ మెమో, పోడ్‌కాస్ట్, వెదర్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేటర్, టైమర్ వంటి యుటిలిటీ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ ఆధారిత, ఓపెన్ సోర్స్ టూల్స్‌ను సురక్షితంగా అభివృద్ధి చేసి ఉపయోగించేందుకు కొత్త డెవలపర్ ప్రోగ్రామ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. హార్డ్‌వేర్ పరంగా లైట్ ఫ్లిప్ ఆధునిక స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. ఇందులో 2.8 ఇంచుల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 480×640 పిక్సెల్స్ రిజల్యూషన్, మ్యాట్ ఫినిష్ స్క్రీన్ ఉన్నాయి. మీడియాటెక్ ఎంటీ8873 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
డ్యుయల సిమ, రీప్లేసబుల్ బ్యాటరీ..
ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ (నానో సిమ్ + ఈ-సిమ్) ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండగా, ఇది 12 మెగాపిక్సెల్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5జి, డ్యుయల్ 4జి వోల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సి 2.0 వంటి ఫీచర్‌లు ఉన్నాయి. 1,800 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన రీప్లేసబుల్ బ్యాటరీని అందించారు. బ్లాక్, నేవీ, రెడ్, పింక్, యెల్లో, లైట్ గ్రే రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయంగా చార్మ్స్ అమర్చుకునేందుకు ప్రత్యేక యాక్సెసరీ లూప్ కూడా ఇచ్చారు.
ధర వివరాలు..
లైట్ ఫ్లిప్ ఫోన్ ధర 299 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.28,870)గా ఉంది. అలాగే కంపెనీ సర్వీస్ ప్లాన్‌తో కలిసి రెండు సంవత్సరాల ఒప్పందంపై నెలకు 39 డాలర్ల నుంచి ప్లాన్‌ల ద్వారా కూడా పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలను నాలుగు విడతల్లో చేపట్టనున్నారు. మొదటి విడత ఏప్రిల్ 2027 ప్రారంభంలో, రెండో విడత ఏప్రిల్ చివరిలో, మూడో విడత మే ప్రారంభంలో, నాలుగో విడత మే చివరిలో పంపిణీ చేయనున్నారు.
తాజావార్తలు
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం
- ●Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
- ●IND Vs ZIM | జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. అయ్యర్ కెప్టెన్ తొలి సిరీస్ కైవసం..

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం



