Assam Rifles | అస్సాం రైఫిల్స్‌లో 354 హవల్దార్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు
Assam Rifles | కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ (Assam Rifles) టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 354 పోస్టులను భర్తీ (Assam Rifles Recruitment) చేయనుంది.
Assam Rifles | కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ (Assam Rifles) టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 354 పోస్టులను భర్తీ (Assam Rifles Recruitment) చేయనుంది. అర్హులైన వారు డిసెంబర్ 14 వరకు అధికారిక వెబ్‌సైట్ assamrifles.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్‌మ్యాన్ ఫీల్డ్, వెహికల్ మెకానిక్, అప్‌హోల్‌స్టర్, మెటల్‌స్మిత్, ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్, ఆర్మర్, మేసన్ వంటి విభాగాల్లో ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు ప్రారంభ వేతనం రూ.21,700 నుంచి రూ.92,300 వరకు ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 354
ఇందులో వారంట్ ఆఫీసర్- 129, హవల్దార్- 6, రైఫిల్‌మ్యాన్- 219 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
వీటిని జనరల్ అభ్యర్థులకు 145, ఓబీసీ 97, ఎస్సీ 53, ఎస్టీ 25, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 34 చొప్పున కేటాయించారు.
విభాగాలవారీగా..
వారంట్ ఆఫీసర్- 124
రైఫిల్‌మ్యాన్ (ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్)- 32
రైఫిల్‌మ్యాన్ (లైన్‌మ్యాన్ ఫీల్డ్)- 21
రైఫిల్‌మ్యాన్ (ఆర్మరర్)- 29
రైఫిల్‌మ్యాన్ (ఇంజినీర్ ఎక్విప్‌మెంట్ మెకానిక్)- 10
రైఫిల్‌మ్యాన్ (రికవరీ వెహికల్ మెకానిక్)- 13
రైఫిల్‌మ్యాన్ (ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్)- 22
హవల్దార్ (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్)- 6
రైఫిల్‌మ్యాన్ (మెటల్‌స్మిత్)- 19
రైఫిల్‌మ్యాన్ (Upholster)- 3
రైఫిల్‌మ్యాన్ స్టోర్ కీపర్ టెక్నికల్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీర్)- 16
రైఫిల్‌మ్యాన్ (వెహికల్ మెకానిక్)- 23
రైఫిల్‌మ్యాన్ (వెల్డర్)- 2
వారంట్ ఆఫీసర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్)- 2
వారంట్ ఆఫీసర్ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్)- 1
వారంట్ ఆఫీసర్ (ఫిజియోథెరపిస్ట్)- 2
రైఫిల్‌మ్యాన్ (మాసన్)- 29
అర్హతలు
పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఇన్‌స్ట్రుమెంట్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీలో కనీసం రెండేండ్ల డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. వారెంట్ ఆఫీసర్, హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 25 ఏండ్లలోపు,మిగిలిన పోస్టులకు 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
డాక్యమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వీటిలో సాధించిన ఫలితాలను బట్టి రూపొందించిన మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
రిక్రూట్‌మెంట్ ర్యాలీ: 2027 జనవరి 18 నుంచి
వెబ్‌సైట్: www.assamrifles.gov.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్
- ●School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం
- ●U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం
- ●Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
- ●BM Sandeep | తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జిగా బీఎం సందీప్

Mirnalini Ravi | ప్రియుడిని పెళ్లిచేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్ - మెహందీ వేడుకల ఫొటోలు వైరల్

School Bus | డ్రైవర్‌కు ఫిట్స్.. 40 మంది స్కూల్ విద్యార్థులు సురక్షితం

U19 Asia Cup 2026 | ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ సంచలన విజయం

Satvika Veeravalli | ఇంజినీర్ నుంచి హీరోయిన్గా - "కాంత" కోసం ఆడిషన్ ఇచ్చా కానీ - సాత్విక వీరవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్






