IndiGo flight | విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్
IndiGo flight | దుబాయ్ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో పొగలు రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే గుజరాత్‌లోని రాజ్‌కోట్ (Rajkot) ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
IndiGo flight | విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన (IndiGo flight) ప్రమాదం తర్వాత పలు విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో పొగలు రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే గుజరాత్‌లోని రాజ్‌కోట్ (Rajkot) ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
దాదాపు 198 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఇండిగోకు చెందిన విమానం ఇవాళ మధ్యాహ్నం దుబాయ్ నుంచి ముంబైకి బయల్దేరింది. అయితే, విమానం గాల్లో ఉండగా ప్రయాణికుల లగేజీ స్టోర్ చేసే డెస్క్ నుంచి పొగలు వస్తున్నట్లుగా పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రాజ్‌కోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టులో అంబులెన్స్, ఫైర్ వంటి అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.
ఈ ఘటనతో ప్రయాణికుల్లో టెన్షన్ మొదలైంది. అయితే, పైలట్ విమానాన్ని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులనంతా కిందకు దించేశారు. పొగలు రావడానికి గల కారణాలపై ఇండిగో సాంకేతిక బృందం దర్యాప్తు చేస్తున్నట్లు రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
STORY | Dubai-Mumbai flight makes emergency landing at Rajkot after smoke detected; all 194 onboard safe
A Dubai-Mumbai IndiGo flight carrying 194 passengers and crew members made an emergency landing at the Rajkot International Airport in Gujarat on Monday after smoke was… pic.twitter.com/ick6y9AUB0
— Press Trust of India (@PTI_News) July 27, 2026
Also Read..
AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్
NEET Row | నందన్ నీలేకని కమిటీలో ఉన్నది ఎవరు? టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుంది?
ప్రారంభించిన 12 రోజులకే.. కుంగిపోయిన రూ.4,700 కోట్ల లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు..
సెప్టెంబర్ 18, 2026

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
సెప్టెంబర్ 4, 2026

Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..



